అప్పట్లో హీరోయిన్లకు పనెక్కువ పారితోషికం తక్కువ!
పరిశ్రమలో స్టార్‌డమ్ - పారితోషికాల పై చర్చ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కెరీర్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పరిశ్రమలో స్టార్‌డమ్ - పారితోషికాల పై చర్చ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కెరీర్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ కాలంలో తాను అత్యధిక పారితోషికం తీసుకునే నటిని కాదని.. అప్పట్లో పరిస్థితి ఇప్పుడున్నట్లుగా లేదన్నారు. నేటి తరం నటులు అందుకుంటున్న భారీ పారితోషికాలతో పోలిస్తే తమ కాలం నాటి లెక్కలు చాలా భిన్నంగా ఉండేవని వివరించారు. హేమా మాలిని వ్యాఖ్యలు గమనిస్తే.. దశాబ్దాల క్రితం సినీ పరిశ్రమ పనితీరు ఎలా ఉండేదో తెలుస్తోంది.
అప్పట్లో నటుల పారితోషికాలు ప్రస్తుత కాలంలా మార్కెట్ విలువపైనే ఆధారపడి ఉండేవి కావు. నిర్మాతల బడ్జెట్ పరిమితులు ..అప్పటి పారదర్శకత లేని ఆర్థిక లావాదేవీలు తారల ఆదాయంపై ప్రభావం చూపేవి. నటీమణులకు సమాన వేతనం దక్కకపోవడం అప్పట్లో ఓ పెద్ద సమస్యగా ఉండేది. దీన్ని హేమామాలిని తన అనుభవాలతో పరోక్షంగా గుర్తు చేశారు. నేటి డిజిటల్ యుగంలో బాక్సాఫీస్ వసూళ్లు, ప్యాన్ ఇండియా మార్కెట్ విస్తృతి పెరగడంతో నటుల పారితోషికాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా సక్సెస్ అయితే లాభాల్లో వాటాలు తీసుకోవడం సాధారణమైపోయింది.
కానీ హేమా మాలిని వంటి అగ్ర తారలు అప్పట్లో కేవలం నిర్ణీత మొత్తంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అప్పటి స్టార్‌డమ్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యేది తప్ప ఆర్థికంగా ప్రస్తుత స్టార్స్‌తో పోల్చలేనంత తేడా ఉంది.
ఈ తారతమ్యాన్ని గమనిస్తే సినిమా పరిశ్రమలో ఆర్థిక క్రమశిక్షణ .. పారితోషికాల విధానం ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఒక నటుడికి లేదా నటికి లభించే గౌరవం ఆర్థిక సంపద కంటే వారి నటనకు దక్కే ప్రశం సలపై ఎక్కువగా ఆధారపడి ఉండేది. ప్రస్తుతం వృత్తిపరమైన మేనేజ్‌మెంట్ సంస్థలు ఉండటం వల్ల నటుల మార్కెట్ విలువను అంచనా వేసి పారితోషికాలు నిర్ణయించడం సులభమైంది.
అయితే తక్కువ పారితోషికం తీసుకున్నంత మాత్రాన వారి స్టార్‌డమ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. హేమా మాలిని వంటి తారలు ఆ రోజుల్లో కూడా అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు. డబ్బు కంటే క్యారెక్టర్ డెప్త్, గుర్తింపుకే అప్పట్లో ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు డబ్బు పెరిగింది. అవకాశాలు పెరి గాయి. కానీ ఆ రోజుల్లో ఉన్న నిబద్ధత ..సరళత నేటి తరం స్టార్స్‌లో ఎక్కడో ఒకచోట లోపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం సినీ రంగం ఆర్థికంగా చాలా ఎదిగింది. నటులు కోట్లలో పారితోషికం అందుకోవడం ఇప్పుడు సాధారణ విషయం. కానీ హేమా మాలిని వంటి సీనియర్ తారలు తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా పాత తరం ..కొత్త తరం మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసింది. స్టార్‌డమ్ అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదని అది ప్రేక్షకులతో ఏర్పరచుకునే గొప్ప బంధమని హేమా మాలిని వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి.