అన్న‌య్య బ‌ర్త్ డే భారీగానే ప్లాన్ చేస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగు సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంటుంది.ఆగ‌స్టు 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఆరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

Update: 2026-07-08 02:36 GMT

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగు సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంటుంది.ఆగ‌స్టు 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఆరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేప‌థ్యంలో ఈసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈసారి వేడుకలను అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణ‌యిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహిం చబోతున్నారని సమాచారం.

ఈవెంట్‌లో చిరంజీవి స్వయంగా పాల్గొని అభిమానులతో కలిసి భారీ కేక్ కట్ చేయబోతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా సామాజిక దూరం .. ఇతర కారణాల వల్ల అభిమానులతో చిరంజీవి ప్రత్యక్షంగా కలుసుకోవడం కొంత పరిమితమైంది. ఈ నేప‌థ్యంలో ఈసారి అందుకు భిన్నంగా అభిమానుల ఆనందమే లక్ష్యంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నారని మెగా సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ వేడుకల వెనుక ఉన్న మరో ముఖ్య ఉద్దేశ్యం చిరంజీవి సినిమాలపై ఉన్న క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల అప్‌డేట్స్‌ను, టీజర్లను.. ఫస్ట్ లుక్ పోస్టర్లను వేడుకలోనే ఆవిష్కరించే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

ఇది కేవలం పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు. మెగాస్టార్ కెరీర్‌లోని తదుపరి మైలురాళ్లను అభిమానులతో పంచుకునే ఓ వేదికగా మారనుందంటున్నారు. భారీ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా మెగా కుటుంబ సభ్యులు .. సుష్మిత కొణిదెల పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. సుష్మిత నిర్మాణ రంగంలోకి వచ్చినప్పటి నుంచి కుటుంబ కార్యక్రమాలను చాలా పక్కాగా, కళాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. డాడ్ పుట్టినరోజు వేడుకను కూడా అందరూ గుర్తుండిపోయేలా క్రమశిక్షణతో కూడిన ఓ వేడుకగా నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిసింది.

అన్న‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉచిత ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేయ‌డం ప‌రిపాటే. ప్ర‌తీ ఏటా ఇది జ‌రిగే కార్య‌క్ర‌మ‌మే అయినా ఈ సారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మ‌రిన్ని సేవా కార్యక్రమాలను కూడా చేప‌ట్టే అవ‌కాశం ఉందంటున్నారు. ఈసారి వేడుక‌ల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాల్గొనే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. అదే జ‌రిగితే ఆ వైబ్ వేరే లెవ‌ల్లో ఉంటుంది. మెగాస్టార్+ ప‌వ‌ర్ స్టార్ ఒకే వేదిక‌పై ఉంటే? ఆ ఊపు ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. వారితో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ స‌హా మిగిలిన మెగా హీరోలంతా కూడా పాల్గొంటారు కాబ‌ట్టి ఆ వేదిక‌ను చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు.

Tags:    

Similar News