ట్రెడిషనల్ చీరలో కుమారి గ్లామర్ టచ్.. ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్‌లో కుమారి 21ఎఫ్' సినిమాతో కుర్రకారు గుండెల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శారీ పిక్స్‌తో రచ్చ చేస్తోంది.
టాలీవుడ్‌లో కుమారి 21ఎఫ్' సినిమాతో కుర్రకారు గుండెల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శారీ పిక్స్‌తో రచ్చ చేస్తోంది. ఎప్పుడూ గ్లామరస్ అవుట్‌ఫిట్లలో కనిపించే ఈ ముద్దుగుమ్మ, ఈసారి సాంప్రదాయ ముకైష్ వర్క్ అండ్ టిష్యూ సిల్క్ చీరలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. మోడరన్ గ్లామర్‌కు ట్రెడిషనల్ లుక్‌ను జోడించి ఆమె ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.
మూడు భాషల్లో ఎంట్రీ.. 'కుమారి 21ఎఫ్'తో తిరుగులేని క్రేజ్:
ముంబైకి చెందిన హెబ్బా పటేల్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, 2014లో తమిళ, కన్నడ మరియు తెలుగు చిత్ర పరిశ్రమల్లోకి ఒకే ఏడాది అడుగుపెట్టింది. తెలుగులో 'అలా ఎలా?' సినిమాతో పరిచయమైనప్పటికీ, 2015లో రాజ్ తరుణ్ సరసన నటించిన 'కుమారి 21ఎఫ్' చిత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఈడోరకం ఆడోరకం', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.
ఓటీటీలోనూ అదరగొడుతున్న 'కుమారి':
కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హెబ్బా ముందుకు సాగుతోంది. నేరుగా ఓటీటీలో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' మరియు రీసెంట్ మూవీ 'ఓదెల 2'తో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించి ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
చీరలో కిల్లింగ్ లుక్స్:
తాజా ఫొటోషూట్‌లో హెబ్బా పటేల్ సాంప్రదాయ పట్టుతో రూపుదిద్దుకున్న పిక్‌లో గోల్డ్ అండ్ కాపర్ ఆరెంజ్ టిష్యూ జరీ చీరలో రెడ్ బ్లౌజ్ ధరించి సంప్రదాయ బ్యూటీగా మెరిసిపోయింది. ఇక పట్టు చీరను, దానికి సరిపోయే లోతైన సింధూర ఎరుపు రంగు, చేతుల పట్టు బ్లౌజ్‌ను ధరించింది. వీటికి మ్యాచింగ్ స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్, గ్రాండ్ లుక్ చోకర్ నెక్లెస్ ధరించి తన లుక్‌ను కంప్లీట్ చేసింది.
ట్రెడిషనల్ చీరకట్టులోనూ తనదైన గ్లామర్ అండ్ బ్యాక్ అందాలతో అభిమానులకు గిలిగింతలు పెడుతోంది హెబ్బా పటేల్. పాత్రలకు అనుగుణంగా ఒదిగిపోతూ, ఫ్యాషన్‌లోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ ‘కుమారి’ లుక్స్‌పై మీరూ ఒక లుక్కేసేయండి