దిల్ రాజు ఫ్యామిలీ నుంచి దర్శకుడు.. హీరో ఎవరంటే?
ప్రొడ్యూసర్ నుంచి దర్శకుడిగా మారేందుకు హర్షిత్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్.;
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. 28 ఏళ్ల క్రితం పెళ్లి పందిరి మూవీతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆయన పేరు ఏకంగా దిల్ రాజుగా మారిపోయింది.
అప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించి సినీరంగంలో అగ్ర నిర్మాతగా నిలిచారు దిల్ రాజు. ఇటీవల ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేశారు. అయితే దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ అనేక మంది ఆయన అడుగుజాడల్లో నడిచారు.
దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి, ఆయన సోదరుడి కొడుకు హర్షిత్ రెడ్డి.. నిర్మాతలుగా మారారు. వివిధ సినిమాలకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరో అయ్యారు. ఇప్పటి వరకు యాక్టింగ్ లోకి ఆ ఫ్యామిలీ నుంచి ఆయనొక్కరే అడుగుపెట్టారు. ఇప్పుడు మరొక హీరో కూడా రానున్నారు.
హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీతా కళ్యాణ వైభోగమే మూవీతో డెబ్యూ ఇవ్వనున్నారు. అదే సమయంలో హర్షిత్ రెడ్డి ఇప్పుడు దర్శకుడిగా మారనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో డైరెక్టర్ గా డెబ్యూ మూవీని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
ప్రొడ్యూసర్ నుంచి దర్శకుడిగా మారేందుకు హర్షిత్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్. ఒక బడా హీరో కోసం సినిమా కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే పనులు పూర్తయ్యాయని వినికిడి. అయితే ఇప్పటికే హర్షిత్ రెడ్డి.. పలు తెలుగు సినిమాలను నిర్మించారు. అందులో బలగం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఆ సినిమాను దిల్ రాజు సపోర్ట్ తో హర్షిత్ రెడ్డి నిర్మించారు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాతగా వ్యవహరించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. భారీ లాభాలు అందించింది. ఆ తర్వాత లవ్ మీ, జనక అయితే గనక సినిమాలను హర్షిత్ రెడ్డి రూపొందించారు. ఇప్పుడు డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.