నటితో అల్లం కషాయం తాగించిన బాలయ్య!
బాలీవుడ్ లో `భజ్ రంగ్ భాయిజాన్` చిత్రంతో బాల నటిగా పరిచయమైంది హర్షాలీ మల్హోత్రా.;
బాలీవుడ్ లో `భజ్ రంగ్ భాయిజాన్` చిత్రంతో బాల నటిగా పరిచయమైంది హర్షాలీ మల్హోత్రా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం 2015లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ హర్షాలీ వెండి తెరపై కనిపించలేదు. మళ్లీ పదేళ్లకు అప్పటి బాల నటి ఇప్పుడు పెద్ద నటిగా అలరించడానికి రెడీ అయింది. అదీ ఓ తెలుగు సినిమాతో కావడం విశేషం. మరి బాలీవుడ్ అవకాశాలు రాక పనిచేయలేదా? వచ్చినా వద్దనుకుందా? అన్నది తెలియదు గానీ హర్షాలీ `అఖండ 2`తో టాలీవుడ్లో లాంచ్ అవుతుంది.
ఆ పాత్రతో ఎప్పటికీ గుర్తుండిపోతా:
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా హర్షాలీ టాలీవుడ్ డెబ్యూ పై సంతోషం వ్యక్తం చేసింది. `భజిరంగ్ భాయిజాన్` తర్వాత హిందీలో చాలా అవకాశాలు వచ్చినా నటించలేదంది. `అఖండ 2`లో మంచి పాత్ర కావడంతో ఒకే చెప్పినట్లు తెలిపింది. కథ విన్నాక ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించిందంది. జనని పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.
కుటుంబంలో సభ్యురాలిగా చూసుకున్నారు:
బాలయ్యతో నటించడం కంటే ముందుగా ఆయన నటించిన సినిమా కొన్ని చూసినట్లు తెలిపింది. దీంతో సెట్ లో కి వచ్చిన కొత్తలో కొంత ఒత్తిడికి కూడా గురైనట్లు చెప్పుకొచ్చింది. కానీ బాలయ్య అది గమనించి ధైర్యం చెప్పి, ప్రోత్స హించారని చెప్పింది . తన కుటుంబంలో సభ్యురాలిగా చూసుకున్నారంది. అలాగే అల్లం కషాయం తాగమని కూడా బాలయ్య సలహా ఇచ్చారంది. ఆయన మాట కోసం ఇష్టం లేకపోయినా తాగినట్లు చెప్పుకొచ్చింది. మరి హర్షాలీకి టాలీవుడ్ లో ఇకపై ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
బుల్లి తెరపైనా మెరిసింది:
బాల నటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సక్సెస్ అయింది చాలా తక్కువ మందే. వారు కూడా కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు. స్టార్ హీరోయిన్లు కాలేకపోయారు. మరి ఈ బాల నటి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో `నాస్తీక్` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే సినిమాలకంటే ముందుగా బుల్లి తెర సీరియల్స్ లోనూ మెరిసింది. మూడు హిందీ సీరియల్స్ లో నటించింది. ఫిలిం ఫేర్, స్టార్ అవార్డులు కూడా దక్కిచుకుంది.