వీరమల్లు ట్రైలర్ లెక్క తేల్చాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్రో తర్వాత వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాను వాయిదాలు వేస్తూ వేస్తూ ఫైనల్ గా జూలై 24న రిలీజ్ లాక్ చేశారు;

Update: 2025-07-01 12:37 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్రో తర్వాత వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాను వాయిదాలు వేస్తూ వేస్తూ ఫైనల్ గా జూలై 24న రిలీజ్ లాక్ చేశారు. ఈసారి రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అన్నట్టే. పవన్ కళ్యాణ్ కూడా సినిమా రిలీజ్ కు కావాల్సిన సపోర్ట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే వీరమల్లు ట్రైలర్ ని ఈ నెల 4న రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరమల్లు మీద కాస్త అసంతృప్తిగా ఉన్నారు. నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉండటం ఒక కారణమైతే వరుస వాయిదాల వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గింది. ఐతే అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మళ్లీ ట్రైలర్ తో సినిమాపై బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరమల్లు ట్రైలర్ తోనే బిజినెస్ లెక్కలు కూడా సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించిన హరి హర వీరమల్లు సినిమా ఓటీటీ డీల్ ఎప్పుడో క్లోజ్ అయ్యింది. 80 కోట్ల దాకా ప్రైం వీడియో నుంచి ఓటీటీ డీల్ ఓకే చేసుకున్నారని టాక్. మరో 30 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వచ్చాయట. అంటే వీరమల్లుకి రిలీజ్ ముందే 110 కోట్ల పైన వచ్చేశాయి. ఐతే వీరమల్లు ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం వాటిని అప్పులకు కట్టడానికే ఉపయోగించారని టాక్.

ఇక సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా సితార నాగ వంశీ భారీ రేటుకే కొన్నారు. సితార రిలీజ్ కాబట్టి సినిమాపై మంచి హోప్ ఉంది. ఐతే వీరమల్లు సినిమా నుంచి రాబోతున్న ట్రైలర్ తోనే సినిమా మీద ఒక హైప్ తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట. క్రిష్ నుంచి జ్యోతికృష్ణ హ్యాండోవర్ లోకి వచ్చాక కూడా సినిమాను చాలా బాగానే చేశాడని టాక్.

వీరమల్లు సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కి కూడా పవన్ వస్తారని తెలుస్తుంది. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అప్పుడెప్పుడో వీరమల్లు టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఇక మూడు రోజుల్లో రాబోతున్న ట్రైలర్ మీదే అందరి గురి ఉంది. మరి ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడో శాంపిల్ చూపించేలా వస్తున్న వీరమల్లు ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News