• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలీవుడ్ సినీ లవర్స్ కు...

కోలీవుడ్ సినీ లవర్స్ కు కష్టకాలం

| ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ఉదయం తొమ్మిది గంటల నుంచి థియేటర్స్ లో షోలు వేయాలి. మార్నింగ్, బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం లేదు.

By - Tupaki Desk
Update: 2023-11-10 07:45 GMT

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ తోనే ఐదు భాషలలో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ మార్కెట్ వచ్చిన తర్వాత వీలైనన్ని ఎక్కువ భాషలలో సినిమాలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. షూటింగ్ ఒక వెర్షన్ లోనే చేసిన పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ డబ్బింగ్ తో ఇతర భాషలలో అందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకి డిజిటల్ ఛానల్స్ నుంచి రైట్స్ రూపంలో ఎక్కువ ఆదాయం దొరుకుతోంది.

అలాగే తమిళ్ స్టార్స్ కూడా తమ సినిమాలని పాన్ ఇండియా బ్రాండ్ తో అన్ని ప్రాంతీయ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాలు ఇతర భాషలలో ముందుగా రిలీజ్ అవుతున్నాయి. అన్ని చోట్ల రిలీజ్ అయిన తర్వాత తమిళనాట థియేటర్స్ లో ప్రదర్శనకి వస్తోంది. తాజాగా కార్తి జపాన్ మూవీ బెంగళూరులో ఉదయం ఏడు గంటలకి ఫస్ట్ షో పడింది. తరువాత హైదరాబాద్ లో షో ప్రారంభం అయ్యింది.

ఉదయం తొమ్మిది గంటలకి తమిళనాట చెన్నైలో షోలు ప్రారంభం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమాల రిలీజ్ విషయంలో కీలక ఉత్తర్వులు అమల్లోకి తీసుకొచ్చాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ఉదయం తొమ్మిది గంటల నుంచి థియేటర్స్ లో షోలు వేయాలి. మార్నింగ్, బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం లేదు. అలాగే అదనపు షోలకి కూడా అనుమతులు పూర్తిగా రద్దు చేశారు.

అజిత్ తునివు మూవీ రిలీజ్ సమయంలో ఉదయం ఫ్లెక్సీ కడుతూ ఒక అభిమాని చనిపోయాడు. దీంతో ప్రభుత్వం సినిమాల రిలీజ్ విషయంలో మార్గదర్శకాలు తీసుకొచ్చాయి. విజయ్ లియో సినిమాకి కూడా ఇదే రూల్ అమలు చేసింది. ఆ చిత్ర నిర్మాత హైకోర్టుకి వెళ్ళిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొమ్మిది గంటలకి మొదటి షో ప్రారంభించారు.

అయితే అంతకంటే ముందుగానే ఓవర్సీస్ తో పాటు ఇతర రాష్ట్రాలలో లియో మూవీ షోలు పడిపోయాయి. ఫైనల్ గా తమిళనాడులో పడింది. ఈ పద్ధతి భవిష్యత్తులో రిలీజ్ కాబోయే సినిమాలకి కూడా అమలులో ఉండనుంది. దీనిపై స్టార్ హీరోల అభిమానులు మాత్రం పెదవివిరుస్తున్నారు. అయితే తటస్థ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.

Tags:    
  • Kollywood 
  • Tamilnadu 
  • Movierelease 
  • Benifitshow 
  • Permission 
  • Earlyshows 
  • Fans 
  • Leomovie 
  • Japanmovie 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS