రెబల్స్ ఎటాకింగ్ అలానే ఉంటుంది మరి..!

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ హను రాఘవపూడి అటెండ్ అయ్యాడు.;

Update: 2025-10-16 04:38 GMT

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ హను రాఘవపూడి అటెండ్ అయ్యాడు. డ్యూడ్ యూనిట్ అందరి గురించి మాట్లాడాడు. ప్రదీప్ మల్టీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు హను రాఘవపూడి. ఇక హను మాట్లాడుతున్న టైం లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అరుపులు కేకలు వేశారు. సినిమా అప్డేట్ ఇవ్వాలని అడిగారు. దానికి ఆయన త్వరలోనే సినిమా నుంచి అప్డేట్ వస్తుందని అన్నారు. సినిమా టైటిల్ ఫౌజీనా కాదా అన్నది కూడా అనౌన్స్ చేస్తామని అన్నారు. రెబల్ ఫ్యాన్స్ ఎటాకింగ్ అలానే ఉంటుంది. ఒక్కసారి డైరెక్టర్ కంగారు పడేలా చేశారు.

తక్కువగా మాట్లాడతాడు.. పనితనం అంతా సినిమాలోనే చూపిస్తాడు..

మామూలుగానే హను రాఘవపూడి చాలా తక్కువగా మాట్లాడతాడు. తన పనితనం అంతా సినిమాలోనే చూపిస్తాడు. అందాల రాక్షసి సినిమాతోనే అతని టాలెంట్ గుర్తించినా కమర్షియల్ హిట్ పడితేనే డైరెక్టర్ గా పేరొస్తుంది. పడి పడి లేచే మనసు సినిమా విషయంలో డైరెక్టర్ డిజప్పాయింట్ చేశాడు. ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ తో తీసిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు హను రాఘవపూడి. ఆ మూవీ తర్వాతే ప్రభాస్ తో పీరియాడికల్ మూవీ అది కూడా ఇండిపెండెన్స్ ముందు కథతో వస్తున్నాడు.

ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు టాక్. ఎందుకంటే ప్రీ ఇండిపెండెన్స్ వార్ బ్యాక్ డ్రాప్ తోనే ఈ సినిమా వస్తుందట. హను లవ్ స్టోరీస్ ని బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఆ నేపథ్యంలో ఒక ఫిక్షనల్ లవ్ స్టోరీ రాసుకున్నాడట. సినిమా ఇప్పటివరకు జరిగిన పార్ట్ చూసి చిత్ర యూనిట్ చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారట. ముఖ్యంగా ప్రభాస్ ఫౌజీ రెబల్ ఫ్యాన్స్ కి ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ అందిస్తుందని అంటున్నారు.

ప్రభాస్ సినిమా త్వరగా అప్డేట్స్..

ప్రభాస్ ఫౌజీ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ సినిమా పూర్తి కాగానే ఫౌజీ పనుల్లో బిజీ అయిపోతాడు. ఐతే రాజా సాబ్ ను మొన్నటిదాకా 2026 సంక్రాంతి రిలీజ్ అన్నారు ఇప్పుడు మళ్లీ సమ్మర్ కి వాయిదా వేస్తారనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా హనుతో ప్రభాస్ చేస్తున్న సినిమా త్వరగా అప్డేట్స్ మొదలు పెట్టాలని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.

ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ మాత్రమే కాదు స్పిరిట్, కల్కి 2 చేయాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కూడా చేయాల్సి ఉంది. ఐతే ఆ సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉంది. ఎందుకంటే నీల్, ఎన్ టీ ఆర్ సినిమా పూర్తయ్యాక కానీ సలార్ 2 పనులు మొదలు పెట్టే ఛాన్స్ లేదు.

Tags:    

Similar News