ప్రభాస్ 'ఫౌజీ'.. హను చుట్టూ సవాళ్లే..

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి.. 13 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. సీతారామం మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-24 03:00 GMT

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి.. 13 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. సీతారామం మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమాతో అందరినీ మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు.

అయితే చదువు పూర్తవగానే ఉద్యోగం చేయడం ఇష్టం లేక తనకిష్టమైన రచనను వృత్తిగా చేసుకోవడం కోసం సినిమా రంగంలోకి రావాలనుకున్న హను.. మొదట అమృతం సీరియల్ కు రచయితగా పనిచేశారు. ఆ తర్వాత ఐతే, ఒక్కడున్నాడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌ గా, అనుకోకుండా ఒక రోజు సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌ గా వర్క్ చేశారు.

2012లో అందాల రాక్షసి మూవీతో డైరెక్టర్ గా మారిన ఆయన.. ఇప్పటి వరకు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, అబద్ధం, పడి పడి లేచె మనసు, సీతారామం సినిమాలు తీశారు. అవన్నీ లవ్ స్టోరీ చిత్రాలు కావడం విశేషం. తన మార్క్ ప్రేమ కథా చిత్రాలతో అందరినీ అలరించారు. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ స్టోరీతో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఫౌజీ తెరకెక్కిస్తున్నారు.

నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి.. 1940 బ్యాక్ డ్రాప్ లో ధైర్యవంతుడైన భారతీయ సైనికుడి కథతో ఫౌజీ మూవీ తీస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పీరియాడిక్ సెటప్ లో సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో కూడా హను మార్క్ లవ్ స్టోరీ ఉన్నా ఆయన గత చిత్రాలకు ఫౌజీ పూర్తిగా భిన్నంగా ఉండనుందనే చెప్పాలి.

దీంతో ఫౌజీ మూవీతో హను రాఘవపూడికి పెద్ద సవాళ్లు ఎదురవ్వనున్నాయని ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్.. బడా హీరోతో వర్క్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హను.. మీడియం, చిన్న రేంజ్ హీరోలతోనే చేశారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న డార్లింగ్ తో సినిమా తీస్తున్నారు.

కాబట్టి సినిమా చుట్టూ భారీ అంచనాలు ఉన్నాయి.. ఉంటాయి కూడా.. అదే సమయంలో ఫుల్ డెప్త్ ఉన్న స్టోరీ కూడా మూవీ తెరకెక్కిస్తున్నారని చెప్పాలి. ఇది కూడా ఆయన కెరీర్ లో తొలిసారి. దీంతో ఇప్పుడు ఫౌజీ మూవీ విషయంలో హను రాఘవపూడి సవాళ్లనింటినీ ఎలా దాటుతారనేది ఆసక్తికరంగా మారింది. మరేం చేస్తారో.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News