యాపిల్ పిల్ల స్పీడ్ పెంచుతుందా?
ఒకప్పుడు యాపిల్ పిల్లగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ గురించి అందరికీ తెలిసిందే.;
ఒకప్పుడు యాపిల్ పిల్లగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ గురించి అందరికీ తెలిసిందే. బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అమ్మడు.. స్టార్ హీరో అల్లు అర్జున్ దేశముదురు మూవీతో టాలీవుడ్ లోకి వచ్చింది. డెబ్యూ మూవీతో మంచి హిట్ అందుకున్న ఆమె.. బబ్లీ బ్యూటీగా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక మంది కుర్ర హీరోల సరసన నటించింది.
తెలుగులో డెబ్యూ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కొన్నేళ్లుగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. చివరగా తెలుగులో 105 మినిట్స్ మూవీలో సందడి చేసింది. అదే సమయంలో కోలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుని దూసుకుపోతుందనే చెప్పాలి.
ప్రస్తుతం రౌడీ బేబి, మ్యాన్, గాంధారి సహా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న హన్సిక.. బాలీవుడ్ లో లవ్ ఎఫైర్ మూవీలో నటిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతోంది. రీల్స్ తో పాటు డిజిటల్ కంటెంట్ పై ఫుల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన సినిమాల స్పీడ్ ను ఫుల్ గా పెంచనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా సినిమాలు చేసేందుకు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు హన్సిక మొగ్గు చూపుతున్నట్టు వినికిడి.
అయితే రీసెంట్ గా ఆమె పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తన భర్తతో విడాకులు తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితం హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ భర్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమాయణం నడిపి, ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి మనువాడింది.
కానీ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలో విడాకులు కూడా తీసుకునే ఆలోచనలో ఉందని ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. సోహైల్ ఇప్పటికే ఆ వార్తలను ఖండించినా.. హన్సిక మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. అయితే విడాకుల విషయంలో నిజమెంతో తెలియకపోయినా.. కెరీర్ విషయంలో మాత్రం దూకుడు పెంచుతుందనేది మాత్రం నిజమట.