ఆ హీరోతో గొడవ నిజం.. స్నేహితులన్నాక సహజమే..!
కష్ట సుఖాల్లో తోడుండే వాడు ఫ్రెండ్. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అన్న తర్వాత మనస్పర్థలు సహజమే
రెహమాన్ మేనల్లుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. తెలుగులో జి వి ప్రకాష్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని మాత్రమే తెలుసు కానీ తమిళంలో అతను హీరోగా క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రెబల్ అంటూ ఒక సినిమాతో వచ్చిన జి వి ప్రకాష్ ఏప్రిల్లో డియర్ అనే సినిమాతో వస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో గొడవపై నోరు విప్పాడు జి వి ప్రకాష్. ధనుష్ తాను మంచి స్నేహితులమని అయితే మా మధ్య గొడవల కారణంగా దాదాపు ఆరేళ్లు మేమిద్దరం మాట్లాడుకోలేదని చెప్పారు జి వి ప్రకాష్. ధనుష్ మంచి మనిషి.. ఇష్టమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ధనుష్ తో క్రికెట్ ఆడటం ఇష్టమని అన్నాడు జి వి ప్రకాష్.
కష్ట సుఖాల్లో తోడుండే వాడు ఫ్రెండ్. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అన్న తర్వాత మనస్పర్థలు సహజమే. మళ్లీ కలవడం కూడా కామనే. అవసరమైనప్పుడు అర్థం చేసుకోవడమే నిజమైన స్నేహమని అంటున్నాడు జివి ప్రకాష్. ధనుష్ హీరోగా వచ్చిన మయక్కాం ఎన్నా, ఆడుకలం సినిమాలకు పనిచేసిన జి వి ప్రకాష్ ఆఫ్టర్ గ్యాప్ రీసెంట్ గా వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
హీరో, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఎంత మంచి రిలేషన్ ఉంటే వారి సినిమా మ్యూజిక్ అంత ఇంపాక్ట్ గా ఉంటుంది. అయితే ధనుష్ కి దూరంగా ఉన్న కొన్నాళ్లు అతని సినిమాలకు మ్యూజిక్ అందించని జివి ప్రకాష్ కెప్టెన్ మిల్లర్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా జివి ప్రకాష్ రెండు పాత్రల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్ తర్వాత రాయన్ అంటూ తన స్వీయ దర్శకత్వంలో సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు ధనుష్. ధనుష్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమా మాత్రం హిట్ టార్గెట్ పక్కా అనేస్తున్నారు తెలుగు ఆడియన్స్.