సామ్ తో జామ్.. హిందీ నటుడికి జాక్‌పాట్ తగిలినట్టేనా?
ఈ సినిమా టీమ్ లో నేను కూడా చేరాను! అంటూ ఆనందం వ్యక్తం చేసాడు బాలీవుడ్ యువనటుడు గుల్షన్ దేవయ్య. అతడి పాత్ర వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.;
సమంత సరసన అవకాశం అంటే ఆ యువహీరోకి లక్ చిక్కినట్టే. ఇంతకుముందు సమంత సరసన `యశోద` చిత్రంలో నటించాడు కన్నడ హీరో ఉన్ని ముకుందన్. ఆ చిత్రంలో అతడి నటనకు పేరొచ్చింది. కానీ ఆశించిన విజయం దక్కలేదు. కానీ ఉన్నిముకుందన్ ఆ తర్వాత `మార్కో` లాంటి పాన్ ఇండియా హిట్టు కొట్టాడు. సామ్ తో పని చేసాక ఈ విజయాన్ని సెంటిమెంటుగా భావిస్తే, ఇప్పుడు మరో యువనటుడు కూడా ఇలాంటి అవకాశం అందుకున్నాడు. ఇది జాక్ పాట్ గా మారుతుందా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. కానీ తెలుగులో ఈ యువహీరోకి మరింత పాపులారిటీ పెరుగుతుందనడంలో సందేహం లేదు. కాంతార చాప్టర్ 1లో అతడి నటన ఆకట్టుకుంది. ఎప్పుడూ మత్తు, మగువలతో శృంగారంలో మునిగి తేలేవాడిగా, బద్ధకిష్ఠి యువరాజుగా దేవయ్య నటనకు మంచి మార్కులే వేసారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఇపుడు సమంత సినిమాలో అతడి పాత్ర ఏమిటన్న క్యూరియాసిటీ నెలకొంది.
సమంత ప్రధాన పాత్రలో `మా ఇంటి బంగారం` ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీమ్ లో నేను కూడా చేరాను! అంటూ ఆనందం వ్యక్తం చేసాడు బాలీవుడ్ యువనటుడు గుల్షన్ దేవయ్య. అతడి పాత్ర వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. కానీ కాంతార చాప్టర్ 1తో సౌత్ కి పరిచయమైన అతడు వెంటనే సమంత లాంటి స్టార్ సరసన అవకాశం అందుకోవడంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఉన్ని ముకుందన్ కి జరిగినట్టే, ఇప్పుడు దేవయ్యకు కూడా కలిసొస్తుందా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు తర్వాత మళ్లీ స్వీయ ప్రతిభతో ఎదుగుతున్న ఈ హీరోకి లక్ కలిసి రావాలని ఆకాంక్షిద్దాం.
ఆసక్తికరంగా ఓ బేబి చిత్రంలో సమంతతో పాటు నటించిన తేజ సజ్జా కూడా ఇప్పుడు పాన్ ఇండియాలో సత్తా చాటిన హీరోగా వెలిగిపోతున్నాడు. అందువల్ల ఉన్ని ముకుందన్, తేజ సజ్జా తరహాలో గుల్షన్ దేవయ్యకు కూడా సెంటిమెంట్ వర్కవుటవుతుందేమో చూడాలి.
`మా ఇంటి బంగారం` షూటింగ్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రానికి ఓ బేబి ఫేం నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.