సుమంత్ మళ్లీ రావా.. విజయ్ చేసుంటే..

సుమంత్ లీడ్ రోల్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన సీమా మళ్లీ రావా.. 8 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సుమంత్ కి ఒక మంచి సక్సెస్ అందించింది.;

Update: 2025-07-26 15:30 GMT

సుమంత్ లీడ్ రోల్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన సీమా మళ్లీ రావా.. 8 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సుమంత్ కి ఒక మంచి సక్సెస్ అందించింది. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ తో సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి సక్సెస్ అందుకుని అతని ప్రతిభ చాటాడు. ఐతే ఈ సినిమా తర్వాత జెర్సీ తో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గౌతం తిన్ననూరి. నాని తో గౌతం తీసిన జెర్సీ సినిమా మరోసారి డైరెక్టర్ టాలెంట్ చూపించింది.

ఐతే జెర్సీ సినిమా తెలుగులో హిట్ అవ్వడంతో హిందీలో ఆ సినిమా చేశాడు గౌతం. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ అందులో నటించారు. సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ బాలీవుడ్ ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్ పీరియన్స్ అందించింది. ఐతే జెర్సీ తర్వాత మళ్లీ తెలుగులో కింగ్ డం తీశాడు గౌతం. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా వచ్చింది.

జెర్సీ ఛాన్స్ ఇచ్చిన సితార బ్యానర్ లోనే ఈ సినిమా వస్తుంది. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్ సినిమాపై బజ్ పెంచింది. ఐతే కింగ్ డమ్ సినిమా ఈ నెల 31న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా తో కింగ్ డం డైరెక్టర్ గౌతం, హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ చిట్ చాట్ చేశారు.

గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ మళ్లీ రావా సినిమా కూడా విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్న కానీ అది కుదరలేదు. ఐతే ఇది తెలిసిన విజయ్ ఫ్యాన్స్ ఒకవేళ మళ్లీ రావా విజయ్ దేవరకొండ చేసి ఉంటే ఎలా ఉండేది అని ఊహించుకుంటున్నారు. విజయ్ తో సినిమా అనుకోగానే ఇద్దరు బ్రదర్స్ గ్యాంగ్ స్టర్ కథ చెప్పా అది కింగ్ డమ్ చేశామని అన్నారు. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్ట పడ్డాడని.. తప్పకుండా దానికి తగినట్టుగానే ఫలితం ఉంటుందని అన్నారు గౌతమ్. ఇక కింగ్ డమ్ ఫస్ట్ లుక్ నచ్చి విజయ్ కి చెప్పానని.. త్రూ అవుట్ ఆ లుక్ తో ఉన్న ఎపిసోడ్స్ అన్ని తనకు నచ్చాయని యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ అన్నారు.

Tags:    

Similar News