ఈ టాప్ రికార్డులో GOG చేరడం పక్కా

ఈ ఏడాది ప్రథమార్ధంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Update: 2024-05-10 06:13 GMT

ఈ ఏడాది ప్రథమార్ధంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నెలకి 15 నుంచి 25 సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు మాత్రం స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా చూసుకుంటే హనుమాన్ మూవీ మొదటి స్థానంలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 350+ కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది.

మరల ఆ స్థాయిలో టాలీవుడ్ లో సెన్సేషన్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టిన మూవీ టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ టిల్లు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా 130+ కోట్ల గ్రాస్ కలెక్ట్ టాప్ 3 లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం 177 కోట్ల కలెక్షన్స్ రాబట్టి టాప్ గ్రాస్ చిత్రాలలో రెండో స్థానంలో ఉంది. ఈ మూడు సినిమాలు మాత్రమే ఈ ఏడాది 100 కోట్లకి పైగా రాబట్టిన తెలుగు మూవీస్ గా నిలిచాయి.

Read more!

ఆ తరువాత కింగ్ నాగార్జున నా సామి రంగా మూవీ 37 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ 31 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ టాప్ గ్రాస్ చిత్రాల జాబితాలో ఈ నెలలో రిలీజ్ కాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 17న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

ఇప్పటి వరకు మూవీ నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్, సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గోదావరి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా పబ్లిక్ నుంచి సానుకూల స్పందన ఉంది. దానికి తగ్గట్లుగానే సినిమాలో ఇంటరెస్టింగ్ కంటెంట్ ఉండబోతోందని ట్రైలర్ ద్వారా చూపించారు.

కచ్చితంగా ఈ సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా గోదావరి స్లాంగ్ ని నేర్చుకొని ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పారు. అతని మాస్ లుక్ కూడా యూత్ లో మంచి వైబ్ క్రియేట్ చేస్తోంది. ఇక పోటీగా పెద్దగా ఏ సినిమాలు లేవు. అసలే సమ్మర్ లో బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యామని ఆకలి మీదున్న ఆడియెన్స్ కు GOG ఫుల్ మీల్స్ అయ్యే అవకాశం ఉంది.

మొదట ఈ సినిమాను మే 17న విడుదల చేయాలని అనుకున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హీట్ ఎక్కువగా ఉండడం, పొలిటికల్ హీట్ పెరగడంతో అది మంచి డేట్ కాదని మే 31న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. హిట్ టాక్ వస్తే సాలీడ్ గ్రాస్ ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News