వెండి తెరపై ఊపు తెచ్చే దేవుళ్లు వీళ్లే!
ఒకప్పుడు దేవుళ్ల నేపథ్యంలో సినిమా అంటే? ఆ దేవుడి పాత్రను ఓ స్టార్ హీరో పోషించేవాడు.;
ఒకప్పుడు దేవుళ్ల నేపథ్యంలో సినిమా అంటే? ఆ దేవుడి పాత్రను ఓ స్టార్ హీరో పోషించేవాడు. దేవుడి పాత్ర లో..ఆహార్యంలో ఆ నటుడు అంతే ఒదిగిపోయేవాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లు భక్తి నేపథ్యంలో కొన్ని సినిమాలు చేసారు. పాత్రలకు తగ్గట్టు ఆ దేవుడు రూపంలోనూ ఒదిగిపోయేవారు. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి లాంటి స్టార్లు మాత్రం వెండి తెర పై దేవుడు అవతారం ఎత్తలేదు. ఆ తర్వాత తరం నటులు కూడా అలాంటి సాహసం చేయలేదు. సినిమా కథల ట్రెండ్ మారడంతో? వెండి తెరపై దేవుడు పాత్రలు కనుమరుగైపోయాయి.
అఘోరగా బాలయ్య విశ్వరూపం:
అయితే బాలయ్య మాత్రం `అఖండ` చిత్రంలో అఘెర లాంటి పాత్రతో ప్రేక్షకులకు కొత్త వినోదాన్ని పంచారు. తాజాగా `అఖండ 2` శివ తాండవంలోనూ అఘోర పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తేలిపోయింది. అఘోర శక్తి సామర్ధ్యాలు ఎలా ఉంటాయి? అన్నది దర్శకుడు బోయపాటి తనదైన శైలిలో చెప్పబోతున్నాడు. అఘోర 2.0 ఓ రేంజ్ లో ఉండబోతుంది. రామాయణం, భాగవతం లాంటి ఇతిహాసాల ఆధారంగా బోయపాటి అఖండ 2 కథను సిద్దం చేసుకున్నాడు. అలాగే ఎస్ ఎస్ ఎంబీ 29 `వారణాసి`లో మహేష్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు.
రాముడి పాత్రే హైలైట్:
రాముడి శక్తి సామర్ధ్యాల ఆధారంగా రాజమౌళి ఆ పాత్రను డ్రెమటైజ్ చేస్తున్నాడు. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ అయినా? రామాయణం ఆధారంగానే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేసారు. హీరో పాత్రను రామతత్వం నుంచే తీసుకున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ జరుగుతోంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ `రామాయణం` తెరకెకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్ర లో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే మొదటి భాగం `రామాయణం` షూటింగ్ పూర్తయింది.
ఇతిహాస పురాణాల ఆధారంగానే:
ప్రస్తుతం రెండవ భాగం షూటింగ్ జరుగుతుంది. అలాగే `మిరాయ్` కి సీక్వెల్ గా `మిరాయ్ జైత్రయాత్ర` రెడీ అవుతుంది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇందులోనూ దైవం హైలైట్ అవుతుంది. ఇంకా చందు మొండేటి `వాయుపుత్ర` చిత్రాన్ని యానిమేషన్ లో రూపొందిస్తున్నాడు. ఈ కథకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. రియల్ పాత్రల తరహాలో యానిమేషన్ పాత్రలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంగేజ్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ పైనా ఆసక్తి నెలకొంది. అలాగే `హనుమాన్` కి సీక్వెల్ గా `జైహనుమాన్` రూపొందుతుంది. ఇందులో హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదీ రామాయణం ఆధారంగానూ తీసుకున్న కథ. అలాగే తమిళ చిత్రం `ముకుత్తి అమ్మన్`, `కల్కి 2`,` `మహాకాళీ` లాంటి చిత్రాల్లో పాత్రలు కూడా ఇతిహాస పురాణాల ఆధారంగానే తీసుకుంటున్నారు.