'గోదారి గట్టుపైన'.. 'బంగారు బొమ్మ' మెలోడీ విన్నారా?
ఆ సాంగ్ ను సంగీత దర్శకుడు నాగవంశీ కృష్ణ వింటేజ్ మెలోడీని గుర్తు చేసేలా సాఫ్ట్ బీట్స్, సెన్సటివ్ స్ట్రింగ్స్ తో కంపోజ్ చేశారు.;
టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న గోదారి గట్టుపైన మూవీ నుంచి రిలీజైన బంగారు బొమ్మ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా నిధి ప్రదీప్ నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, తొలి రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే జోష్ ను కొనసాగిస్తూ మేకర్స్ తాజాగా మూడో పాటగా బంగారు బొమ్మ సాంగ్ ను విడుదల చేశారు. ఎంతో వినసొంపుగా ఉన్న పాట.. ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంటోంది.
ఆ సాంగ్ ను సంగీత దర్శకుడు నాగవంశీ కృష్ణ వింటేజ్ మెలోడీని గుర్తు చేసేలా సాఫ్ట్ బీట్స్, సెన్సటివ్ స్ట్రింగ్స్ తో కంపోజ్ చేశారు. పాత రోజుల మాధుర్యాన్ని గుర్తు చేసేలా మ్యూజిక్ అందించడం.. పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. సాంగ్ వినే వారిలో ఓ ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తోంది. లిరిక్స్ ను బాలాజీ అందించగా, తనకు ఎంతో ఇష్టమైన అమ్మాయిని చూసి ఫిదా అయ్యే యువకుడి ఫీలింగ్స్ ను పదాల రూపంలో చూపించారు.
ఆమెను ప్రేమగా బంగారు బొమ్మగా పిలుస్తూ, ఆమెను చూసినా, గుర్తు చేసుకున్నా మనసు ఎలా తడబడుతుందో పాటలో చెప్పే విధానం ఆకట్టుకుంటోంది. ప్రేమలో కలిగే తెలియని ఆనందం, గుండెల్లో ఉబికి వచ్చే ఎమోషన్స్, మనసులో మిగిలిపోయే జ్ఞాపకాలు వంటి అంశాలను పదాల్లో మలిచారు బాలాజీ. అయితే సాంగ్ కు మెయిన్ అసెట్.. స్టార్ సింగర్స్ ఎస్పీ చరణ్, చిత్ర వాయిస్.
వారి గాత్రం పాటకు ప్రత్యేకమైన మాధుర్యాన్ని తీసుకొచ్చింది. సాఫ్ట్ గా సాగిపోయే ఆ మెలోడీ ప్రతి లైన్ లోనూ భావోద్వేగాన్ని పంచుతూ ఆకట్టుకుంటోంది. హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మొదటి ప్రేమలో ఉండే మధురమైన భావాలు చూపించే సన్నివేశాలు పాటలో ప్రత్యేకంగా నిలిచాయి.
అందమైన విజువల్స్ తో పాటు నేచురల్ ఎమోషన్స్ ప్రేక్షకులకు దగ్గరగా అనిపించేలా రూపొందించామని చిత్రబృందం చెబుతోంది. ఇక సినిమాలో రాజీవ్ కనకాల, లైలా, సుదర్శన్, రాజ్ కుమార్, వైవా రాఘవ, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా బంగారు బొమ్మ పాటతో గోదారి గట్టుపైన సినిమాపై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.