అనుష్క.. భలే ఛాన్సులే

ఇప్పుడు ఆమె నుంచి ‘ఘాటి’ అనే ఇంటెన్స్ మూవీ రాబోతోంది. విలక్షణ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ఈ సినిమా ఎప్పుడో రాావాల్సింది.;

Update: 2025-08-22 07:30 GMT

తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్, మార్కెట్ సంపాదించిన కథానాయికల్లో అనుష్క ఒకరు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె రేపిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ‘బాహుబలి’ తర్వాత అనుష్క ఇంతకుముందులా రెగ్యులర్‌గా సినిమాలు చేయట్లేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో పలకరించిన ఆమెకు మంచి విజయమే దక్కింది. కానీ మళ్లీ గ్యాప్ తప్పలేదు.

ఇప్పుడు ఆమె నుంచి ‘ఘాటి’ అనే ఇంటెన్స్ మూవీ రాబోతోంది. విలక్షణ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ఈ సినిమా ఎప్పుడో రాావాల్సింది. ఆలస్యమై సెప్టెంబరు 5న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఐతే కొంచెం లేటైనప్పటికీ.. ఈ సినిమాకు మంచి టైమింగే కుదిరింది. ‘మిరాయ్’ లాంటి క్రేజీ మూవీతో పోటీ పడాల్సిన సినిమాకు కాస్తా సోలో డేట్ ఖరారైంది.

సెప్టెంబరు 5కే అనుకున్న ‘మిరాయ్’ వాయిదా పడిపోయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా.. ఈ సినిమా పోటీ నుంచి తప్పుకుందన్నది స్పష్టం. ముందు వారం రావాల్సిన మాస్ రాజా రవితేజ చిత్రం ‘మాస్ జాతర’ కూడా వాయిదా పడింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ చిత్రాలు వార్-2, కూలీ ఆల్రెడీ డౌన్ అయిపోయాయి. ‘ఘాటి’ వచ్చే సమయానికి బాక్సాఫీస్ ఖాళీగా ఉంటుంది.

ఇంత అనుకూల వాతావరణం ‘ఘాటి’కి బాాగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ట్రైలర్ చూస్తే ‘ఘాటి’ బలమైన కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. క్రిష్ దర్శకత్వ ప్రతిభకు, అనుష్క స్టార్ పవర్ తోడైతే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయడానికి అవకాశముంది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ‘ఘాటి’ ఎంతమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News