టాక్సిక్ ఎఫెక్ట్.. మ‌గ ద‌ర్శ‌కుల ప‌రువు తీసిన ఆర్జీవీ!

ఆర్జీవీ ఎక్స్ ఖాతాలో ప్ర‌శంస‌ల మోత మోగించాడు. టాక్సిక్ టీజర్ చూశాక గీతూ మోహన్ దాస్ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమని నాకు అర్థమైంది! అని వర్మ ప్ర‌శంసించాడు.;

Update: 2026-01-09 03:54 GMT

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న `టాక్సిక్` టీజర్ జ‌న‌వ‌రి 8న విడుదలై ఆన్ లైన్ లో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక మ‌హిళా ద‌ర్శ‌కురాలు ఇలాంటి గ‌ట్సీ స్టైలిష్ యాక్ష‌న్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారా? అంటూ లోకం విస్తుపోయింది. ముఖ్యంగా మ‌గ ప్ర‌పంచం ముక్కున వేలేసుకుంది. ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్‌కి తాత లాంటి సినిమా తీసింద‌ని గీతూపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ టీజర్ చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. గీతూ మోహన్ దాస్ మేకింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్జీవీ ఎక్స్ ఖాతాలో ప్ర‌శంస‌ల మోత మోగించాడు. టాక్సిక్ టీజర్ చూశాక గీతూ మోహన్ దాస్ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమని నాకు అర్థమైంది! అని వర్మ ప్ర‌శంసించాడు. అంతేకాదు గీతూ మగ దర్శకులకు సవాల్ విసిరార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏ మగ దర్శకుడు కూడా ఈమెతో పోటీ పడలేడు. ఈమె ముందు మగ డైరెక్టర్లందరూ కిందికి పడిపోయారు! అంటూ గీతూ విజన్‌ను, మేకింగ్ స్టైల్ ని ఆకాశానికెత్తేసారు. ఒక మహిళా దర్శకురాలు ఇంతటి వైల్డ్ పవర్‌ఫుల్ విజువల్స్‌ను ఎలా సృష్టించార‌నేది తనకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని ఆర్జీవీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక్క టీజర్‌తోనే బౌల్డ్ అయిపోయాడు:

అస‌లు టీజ‌ర్ లో ఏం ఉంది? అంటే.. అక్క‌డ ఒక క్రిస్టియ‌న్ శ్మ‌శానం. ఒక ప్ర‌ముఖ‌ వ్య‌క్తిని పాతిపెడుతున్నారు. అక్క‌డ ఉన్న‌వాళ్లంతా డాన్ లు, మాఫియా రాజ్ వ్య‌క్తులు. ఆ స‌మ‌యంలో అక్క‌డికి ఒక ల‌గ్జ‌రీ కార్ దూసుకువ‌చ్చింది. కానీ అది ఒక చెట్టుకు గుద్దుకుని ప్ర‌మాదం కార‌ణంగా ఆగిపోయింది.

ఆ స‌మ‌యంలో ఓవైపు కార్ లో య‌ష్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు. మ‌గువ‌తో రోమాంచితంగా ఊగిపోతున్నాడు. ఆ స‌మ‌యంలో కారు మూమెంట్ వల్ల ఒక బాంబ్ ట్రిగ్గర్ అయ్యి అనుకోకుండా విలన్లు పేలిపోయే సీన్ ఆర్జీవీకి బాగా నచ్చింద‌ట‌. శ్మ‌శానంలో విధ్వంసాన్ని గీతూ ఎంతో స్టైలిష్ గా క‌న్విన్సింగ్ గా చూపించిన తీరు ఆక‌ర్షించింది.

ఇలాంటి `బోల్డ్ అండ్ వైల్డ్` థింకింగ్ గీతూలో ఉండటం చూసి వర్మ అవాక్కయ్యారు. ప్ర‌స్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. మెజారిటీ ప్ర‌జ‌లు వర్మ మాటలతో ఏకీభవిస్తూ, గీతూ మోహన్ దాస్ భారతీయ సినిమా స్థాయిని పెంచుతోందని ప్రశంసిస్తున్నారు. అయితే మ‌రికొంద‌రి వెర్ష‌న్ వేరేలా ఉంది. స్త్రీ ద్వేషాన్ని వ్య‌తిరేకిస్తూ గీతూ గ‌తంలో చేసిన‌ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు అదే తరహా గ్లోరిఫైడ్ వయొలెన్స్ ఉన్న సినిమా తీయడాన్ని విమర్శిస్తున్నారు.

అయితే చాలా మంది మేకింగ్ తెలియ‌ని మ‌గ ద‌ర్శ‌కుల‌కు నిజంగానే ఇది స‌వాల్ లాంటిద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. క‌నీసం బో* గా.. వై*గా ఆలోచించ‌లేని వాళ్లు ఈరోజుల్లో ద‌ర్శ‌కులు కాలేర‌ని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ద‌ర్శ‌క‌త్వం ఫేజ్ మారింది. ఇప్పుడు దానికి గ‌ట్స్ కావాలి. ఏదైనా కొత్తగా తీయాలి. షాట్ మేకింగ్ లోనే ఇర‌గ‌దీయాలి. దీనికి ఎంపిక చేసుకునే క‌థ‌తోనే మ్యాజిక్ చేయాల‌ని చాలా మంది నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు.

టాక్సిక్ 19 మార్చి 2026న విడుదలవుతోంద‌ని టీజ‌ర్ లో అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ త‌దిత‌రులు న‌టించారు.




Tags:    

Similar News