విజయ్, త్రిష రిలేషన్.. కోలీవుడ్ నటి అలా అన్నారేంటి?
తమిళనాడులో కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ తన గ్రాండ్ విక్టరీతో కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారారు.;
తమిళనాడులో కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ తన గ్రాండ్ విక్టరీతో కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన పార్టీ వందకుపైగా స్థానాల్లో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు సీఎం అయ్యేందుకు విజయ్ అడుగులు వేస్తున్న వేళ, సోషల్ మీడియాలో మాత్రం మరో అంశం ఎక్కువగా వైరల్ అవుతోంది.
అదే హీరో విజయ్, నటి త్రిష వ్యక్తిగత సంబంధంపై జరుగుతున్న చర్చ. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే త్రిష పుట్టినరోజు కావడం ఆ చర్చను మరింత పెంచిందని చెప్పాలి. విజయ్ సాధించిన విజయాన్ని త్రిషకు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ గా అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇన్ డైరెక్ట్ గా ఆ విధంగానే పోస్ట్ చేశారు.
అదే సమయంలో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా ప్రచారం జోరందుకుంది. దీంతో రాజకీయ విజయానికి మించి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటి గాయత్రి శంకర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో నేమ్స్ లేకుండా ఒక మెసేజ్ పెట్టారు అది విజయ్ త్రిష గురించే అని సోషల్ మీడియా అంటుంది . విజయ్ విజయానికి త్రిష కారణమంటూ ఆమెను విష్ చేస్తున్న వారిపై గాయత్రి అసహనం వ్యక్తం చేశారు.
ఒక పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సొసైటీ ఇదే విధంగా రెస్పాండ్ అయ్యేదా అంటూ ఆమె క్వశ్చన్ చేశారు. ఒక హీరోయిన్ తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని విడదీస్తే సమాజం అస్సలు సహించదని గాయత్రీ అభిప్రాయపడ్డారు. అప్పుడు అదే ప్రజలు తీవ్రంగా విమర్శించేవారని, ఇంటి నుంచి బయటికి రావడానికే ఆమె భయపడే పరిస్థితి వచ్చేదంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి విజయ్- త్రిష జంటకు తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2004లో విడుదలైన గిల్లీ సినిమాలో ఆ జంట మొదటి సారి కలిసి నటించింది. తెలుగు చిత్రం ఒక్కడుకు రీమేక్ గా వచ్చిన ఆ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, ఇటీవల వచ్చిన లియో చిత్రాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.
ప్రత్యేకంగా లియో సినిమా తర్వాత వీరిద్దరి క్లోజ్ నెస్ పై సోషల్ మీడియాలో చర్చ మరింత పెరిగింది. పలు వ్యక్తిగత వేడుకల్లో కలిసి కనిపించడం, ఒక వివాహ కార్యక్రమానికి హాజరు కావడం వంటి సంఘటనలు రూమర్లకు కారణమయ్యాయి. అయితే వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులేనని కొందరు చెబుతుంటారు. కానీ చాలా కాలంగా విజయ్- త్రిష మధ్య రిలేషన్ షిప్ ఉందనే ప్రచారం కొనసాగుతోంది.
ఇక విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిందనే వార్తలు కూడా కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ తో విజయ్ సన్నిహితంగా ఉన్నారని ఆరోపణలు చేసినట్టు ప్రచారం జరిగినా, దీనిపై అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు. మొత్తానికి విజయ్ పొలిటికల్ విక్టరీ పాటు ఆయన పర్సనల్ లైఫ్ పై ఇప్పటికీ తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే నిజానిజాలు పక్కనపెడితే సోషల్ మీడియాలో పర్సనల్ లైఫ్ లపై జరుగుతున్న చర్చలపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.