నా సినిమాల ఆల‌స్యానికి నేనే కార‌ణం!

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే హీరోలలో అడివి శేష్ ఒకరు. భారీ స్టార్‌డమ్ కంటే స్టోరీ సెలెక్ష‌న్, క‌థ‌ క్వాలిటీపై దృష్టి పెట్టడం ద్వారా ఆయన ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.;

Update: 2026-04-08 08:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే హీరోలలో అడివి శేష్ ఒకరు. భారీ స్టార్‌డమ్ కంటే స్టోరీ సెలెక్ష‌న్, క‌థ‌ క్వాలిటీపై దృష్టి పెట్టడం ద్వారా ఆయన ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే అదే సమయంలో ఆయన సినిమాల రిలీజుల్లో ఉండే గ్యాప్ గురించి ఫ్యాన్స్‌లో ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ చర్చకు ప్రధాన కారణం G2. అదే గూఢ‌చారి2.

గాయం వ‌ల్ల ఆగిపోయిన షూటింగ్

గూఢచారి సినిమా స‌క్సెస్ అవ‌డంతో దానికి సీక్వెల్ గా వ‌స్తున్న గూఢ‌చారి2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా ఈ సినిమాను గత ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, పలు కారణాల వల్ల ఆలస్య‌మైంది. ముఖ్యంగా షూటింగ్ దశలో అడివి శేష్ కు కాలికి గాయం కావడంతో మూడు నెలలపాటు షూటింగ్ లు నిలిచిపోయాయి. దీనివల్ల షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం, G2 ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని క్లారిటీ వ‌చ్చింది.

ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్

శేష్ న‌టించిన మ‌రో సినిమా డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లోనే శేష్, గూఢ‌చారి2 రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. డెకాయిట్ రిలీజైన తర్వాత కొద్దికాలంలోనే G2 వస్తుందని అంద‌రూ ఆశించిన‌ప్ప‌టికీ, ఇప్పుడు ఆ గ్యాప్ కొంత ఎక్కువగా ఉండబోతున్నట్టు స్పష్టమైంది. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

న‌టుడిగానే కాకుండా రైటర్ గా కూడా!

శేష్ కు యాక్సిడెంట్ అవ‌డం వ‌ల్ల మూడు నెల‌ల పాటూ షూటింగ్ జ‌ర‌గ‌లేదు వ‌ర‌కు బాగానే ఉంది కానీ త‌న సినిమాలు ఆల‌స్య‌మ‌వ‌డానికి కార‌ణం ప‌రోక్షంగా తానే అని శేష్ ఒప్పుకున్నారు. క్ష‌ణం త‌ర్వాత శేష్ కెరీర్ లో భారీ మార్పొచ్చింది. అప్ప‌ట్నుంచి శేష్ కేవ‌లం న‌టుడిగానే కాకుండా రైట‌ర్ గా కూడా త‌న సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతూ వ‌స్తున్నారు. స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వ‌ర‌కు ప్ర‌తీ అంశంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల సినిమాల‌కు ఎక్కువ టైమ్ ప‌డుతూ వ‌స్తుంది. ఇది సినిమాల ఆల‌స్యానికి కార‌ణ‌మైనా, మ‌రోవైపు అదే అత‌ని సినిమాల క్వాలిటీని కూడా పెంచుతుంది.

రైటింగ్ లో ఇన్వాల్వ్ అవ‌ను

ఈ నేప‌థ్యంలోనే శేష్ కు క్వాలిటీ కోసం టైమ్ తీసుకునే హీరో అనే ఇమేజ్ ఏర్ప‌డింది. క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాల‌కు దూరంగా ఉండి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌ను సెలెక్ట్ చేసుకోవ‌డం అత‌ని స్పెషాలిటీ. అందుకే త‌క్కువ సినిమాలు చేసినా, ప్ర‌తీ ప్రాజెక్టుపై ఒక ర‌క‌మైన న‌మ్మ‌కం ఆడియ‌న్స్ లో ఏర్ప‌డింది. ఇక ఫ్యూచ‌ర్ విష‌యంలో కూడా శేష్ ఇంట్రెస్టింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. డెకాయిట్, గూఢ‌చారి తర్వాత తాను చేసే రెండు సినిమాల్లో రైటింగ్‌లో ఇన్వాల్వ్ కాకుండా వేగంగా పూర్తి చేస్తానని వెల్లడించారు. అంటే ఇకపై ఆయన నుంచి సినిమాల స్పీడ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అడివి శేష్ ఓ వైపు ఆల‌స్యాల‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే, మ‌రోవైపు క్వాలిటీతో ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని గెలుచుకుంటున్నారు. అందుకే అతి సినిమాలు లేట్ గా వ‌చ్చినా, హైప్ మాత్రం ఎప్పుడూ త‌గ్గ‌దు.

Tags:    

Similar News