పెళ్లి వద్దు.. డేటింగ్ బెటర్ -ఫ్లోరా షైనీ
తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఫ్లోరా షైనీ పెళ్లి గురించి మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతం నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు.;
ఫ్లోరా షైనీ.. ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి ఈమె హౌస్ మేట్స్ తో పెద్దగా కలిసేది కాదు.. పైగా హౌస్ లోకి వచ్చిన తొలినాళ్లలోనే ఏడుస్తూ అందరికీ చిరాకు తెప్పించింది. దీనికి తోడు అటు ఆటలలో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ కనబరచలేదు. అంతేకాదు హౌస్ లో చాలామంది ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంది అంటూ తమ అభిప్రాయాలు వెల్లడించారు.. ఎట్టకేలకు ఆడియన్స్ కూడా ఈమెకు ఓట్లు వేయకుండా హౌస్ నుంచి బయటకు పంపించేశారు.
అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఐదు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఫ్లోర్ షైనీ. అందులో భాగంగానే తాజాగా పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటున్న ఈమె.. పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసింది. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఫ్లోరా షైనీ పెళ్లి గురించి మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతం నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. అతడితో డీప్ డేటింగ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే డేటింగ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయడమే బెటర్ అని నాకనిపిస్తోంది. అందుకే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. ఇప్పటికే నా ఫ్రెండ్స్ ఎంతో మందిని చూశాను. వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పైగా పెళ్లయిన రెండు మూడేళ్లకే విడిపోవడం చూసి, నాకు భయమేసింది. అందుకే భవిష్యత్తులో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను" అంటూ తెలిపింది ఫ్లోర్ షైనీ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఫ్లోరా షైనీ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో నువ్వు నాకు నచ్చావ్, మనసున్న మారాజు, చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి , చెప్పాలని ఉంది, అక్క బావెక్కడ, నవ్వుతూ బ్రతకాలిరా, నరసింహనాయుడు, ప్రేమతో రా, రౌడీ షీటర్, శుభకార్యం , అదృష్టం, సొంతం, ఒట్టేసిచెబుతున్నా, స్వామి, మైఖేల్ మదన కామరాజు, స్వాగతం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో చాలా చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
2013లో తెలుగు తెరకు దూరమైన ఈమె అప్పటినుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అటు టీవీ సిరీస్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఫ్లోరా షైనీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.