అయోమయంలో గ్రేట్ డైరెక్టర్
కొన్నిసార్లు ఊహించని సందిగ్ధతలు ఎంత పెద్ద దర్శకుడిని అయినా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ లాంటి టాప్ డైరెక్టర్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది.;
కొన్నిసార్లు ఊహించని సందిగ్ధతలు ఎంత పెద్ద దర్శకుడిని అయినా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ లాంటి టాప్ డైరెక్టర్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది. బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, అగ్ర దర్శకనిర్మాతగా పేరున్న అతడు ఇప్పుడు తన తదుపరి దర్శకత్వ వెంచర్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుండటం ఆశ్చర్యపరుస్తోంది. అతడు నాలుగైదేళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా తీసి బంపర్ హిట్టు కొట్టిందే లేదు. డాన్, డాన్ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఫర్హాన్ తెరకెక్కించాడు. కానీ ఇప్పుడు `డాన్ 3` ని ప్రారంభించేందుకు ఆపసోపాలు పడుతున్నాడు.
ఫర్హాన్ అక్తర్ తన తదుపరి చిత్రం ఏదో నిర్ణయించుకోలేని పరిస్థితి.. డాన్ 3 నుంచి రణ్ వీర్ సింగ్ నిష్కృమించడంతో షారూఖ్ తో ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందని ప్రచారమైంది.. కానీ ఇది కూడా కుదరలేదు. ఖాన్ స్క్రిప్టులో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఫర్హాన్ కి నో చెప్పాడని ఒక సెక్షన్ ప్రచారం సాగిస్తుంటే, మరో సెక్షన్ ఈ ప్రాజెక్టులోకి అట్లీని దర్శకుడిగా తీసుకోవాలని షారూఖ్ కండిషన్ పెట్టడంతో ఫర్హాన్ దానిని వద్దనుకున్నాడని కూడా గుసగుస వినిపిస్తోంది.
తాజా పరిణామం ప్రకారం... ఇప్పుడు డాన్ 3 సినిమాని పక్కన పెట్టి, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జీలే జరా`పై ఫర్హాన్ పూర్తిగా దృష్టి సారిస్తున్నాడట. డాన్ 3ని మొదట ప్రకటించి.. ఒక ర్యాండమ్ హీరో(రణ్ వీర్)ని ఎంచుకున్న తర్వాత షారూఖ్ సీక్వెల్ కోసం సుముఖంగా లేరా? అన్న సందిగ్ధత కూడా ఇప్పుడు ప్రజల్లో బలంగానే ఉంది.
ఏది ఏమైనా కానీ, ఇప్పుడు లాంగ్ డిలే ప్రాజెక్ట్ `జీలే జరా` గురించి మరోసారి చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమన్న సిగ్నల్ అందింది. ప్రియాంక చోప్రా వెంటనే మహేష్ - రాజమౌళితో సినిమాని పూర్తి చేసి ఫర్హాన్ తో మూవీ కోసం రెడీ కావాల్సి ఉంటుంది... ఇప్పటికే ఫర్హాన్ కి ప్రియాంక ఓకే చెప్పేసింది. ఇతర భామల్లో ఆలియా భట్, కత్రిన కైఫ్ కూడా తమ ప్రస్తుత అసైన్ మెంట్స్ పూర్తి చేసి రెడీ అవ్వాల్సి ఉంటుంది.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్స్ లో గమనించదగిన విషయం ఏమిటి? అంటే.. ఫర్మాన్ అక్తర్ బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు హీరోలతో క్రియేటివ్ డిఫరెన్సెస్ ని ఎదుర్కొంటున్నాడు. ``కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం! అన్న చందంగా ఒక వైపు షారూఖ్ ని వదులుకున్నందుకు అతడి వైపు నుంచి సానుకూలత కనిపించడం లేదు.. మరోవైపు గట్టిగా ఒడిసి పట్టుకోవాలని చూసిన రణ్ వీర్ సైతం ఫర్హాన్ ని వదిలించుకుని దూరంగా వెళ్లిపోయాడు. అలా ఇద్దరు టాప్ హీరోలకు ఫర్హాన్ దూరమైపోయాడు. పరిస్థితులు అనాలా లేక అతడికి పూర్తిగా బ్యాడ్ టైమ్ నడుస్తుందని అనాలా? అర్థం కాని కన్ఫ్యూజన్ నెలకొంది. ఫర్హాన్ అన్నిటి నుంచి బయటపడి జీలే జరా, డాన్ 3 చిత్రాలను పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.