ఆమిర్ ఖాన్ పై తమ్ముడి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, తన తమ్ముడు ఫైసల్ ఖాన్ కు మధ్య కూడా చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.;
ఏ అన్నదమ్ముల మధ్య అయినా గొడవలుండటం సాధారణం. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, తన తమ్ముడు ఫైసల్ ఖాన్ కు మధ్య కూడా చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉండగా, దీనిపై ఫైసల్ కోర్టును ఆశ్రయించి, లీగల్ పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫైసల్ తన అన్న ఆమిర్ పై చేసిన ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఎలా బయటపడాలో తెలియలేదు
తనకు మానసిక వ్యాధి ఉందని, పిచ్చివాడని, తన వల్ల సమాజానికి హాని ఉందని చెప్పి తన అన్న తనను ఏడాది పాటూ గదిలో బంధించినట్టు గుర్తు చేసుకున్నారు ఫైసల్. కొన్నేళ్ల కిందట తాను అనుభవించిన ఆవేదన, బాధను ఫైసల్ బయటపెట్టారు. పరిస్థితి బాలేక తన కుటుంబానికి కొన్ని విషయాల్లో సహకరించలేదని, దీంతో వారంతా తనకు పిచ్చి ఉందని అనుకున్నారని, వాళ్ల ఉచ్చులో కూరుకుపోయినట్టు అప్పడు తనకు అర్థం కాలేదని, ఆ తర్వాత అర్థమైనా, దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియలేదని, దీంతో ఏడాది పాటూ ఆమిర్ తనను ఓ గదిలో బంధించాడని ఫైసల్ తెలిపారు.
ఆ సంవత్సరం పాటూ తన దగ్గర ఫోన్ కూడా లేదని, బయట ఎక్కడికీ వెళ్లనివ్వకుండా రూమ్ బయట బౌన్సర్లను పెట్టారని, దీన్నుంచి తన తండ్రైనా కాపాడాతారనుకుంటే అతన్ని ఎలా కాంటాక్ట్ అవాలో కూడా తనకు తెలియలేదని, ఓ ఏడాది తర్వాత ఆమిర్ తనను మరో ఇంటికి మార్చేసినట్టు ఫైసల్ తెలిపారు. ఇదిలా ఉంటే ఫైసల్ గతంలో తన మానసిక ఆరోగ్యం మెరుగయ్యేందుకు ఓ హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే.
20 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆయన పూర్తిగా నార్మల్ అయ్యారని, అయినప్పటికీ ఆమిర్ తనను ఏడాది పాటూ బంధించాడని ఫైసల్ తెలిపారు. మేళ అనే మూవీలో ఆమిర్ ఖాన్ తన సోదరుడు ఫైసల్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ధర్మేశ్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఇక ఆమిర్ ఖాన్ విషయానికొస్తే రీసెంట్ గా సితారే జమీన్ పర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న ఆమిర్, త్వరలోనే కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.