పుష్ప నేర్పిన పాఠం.. ఫహద్ ఫాజిల్ కామెంట్స్..!
మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. ఫహద్ సినిమాలో ఉన్నాడంటే చాలు ఒక మంచి రోల్ లో అతన్ని చూస్తామని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.;
మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. ఫహద్ సినిమాలో ఉన్నాడంటే చాలు ఒక మంచి రోల్ లో అతన్ని చూస్తామని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మలయాళంలో అతను చేస్తున్న సినిమాలతో పాటుగా మిగతా భాషల్లో చేస్తున్న రోల్స్ కూడా అతనికి మంచి పేరు తెచ్చి పెడుతున్నాయి. ఐతే పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెఖావత్ రోల్ మాత్రం ఫహద్ ఫాజిల్ కి కాస్త బ్యాడ్ నేమ్ తెచ్చి పెట్టింది. అదేంటి ఆ సినిమా చాలా పెద్ద హిట్ కదా సినిమాతో నేషనల్ వైడ్ సెన్సేషన్ సృష్టించారు కదా అంటే.. పుష్ప బ్లాక్ బస్టర్ సినిమానే కానీ అందులో ఫహద్ రోల్ మాత్రం అతని ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది.
ఫహద్ రోల్ డిజప్పాయింట్..
ఫస్ట్ పార్ట్ లో ఏదో చివర్లో అలా వచ్చాడు అన్నట్టుగా ఉండగా పుష్ప 2లో మాత్రం ఫహద్ రోల్ ని చాలా డిజప్పాయింట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. ఐతే సినిమా తీసే టైం లో అవుట్ పుట్ ఎలా ఉంటుందో గెస్ చేయడం కష్టం. అందుకే ఫహద్ కూడా సినిమా టైం లో ఏమి చెప్పలేకపోయాడు. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఫహద్ తన రోల్ చూసి తనకే నచ్చలేదన్నట్టుగా ఫీల్ అయ్యాడు. డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఫహద్ రీసెంట్ ఇంటర్వ్యూలో చూచాయగా పుష్ప గురించి తన ఫీలింగ్స్ బయట పెట్టాడు.
రీసెంట్ ఇంటర్వ్యూలో ఫహద్ కొన్ని విషయాలు మన కంట్రోల్ లో లేనప్పుడు మనం ఏమి చేయలేం.. గత ఏడాది ఒక పెద్ద సినిమాలో తాను ఫెయిల్ అయ్యాను. దాని గురించి మాట్లాడదలచుకోలేదు. అందుకే ఏదైనా కంట్రోల్ లో లేనప్పుడు వదిలేయాలి.. దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేశాడు. ఫహద్ చేసిన పెద్ద సినిమా అంటే అది పుష్పానే. అంతేకాదు అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పడం అంటే అది తన పాత్ర నచ్చకపోయినా తను చేయాల్సి రావడమే.
ఆమె చెప్పడం వల్లే..
అసలు పుష్ప సినిమాలో ఫహద్ ని చేసేలా ప్రేరేపించింది మాత్రం ఫహద్ వైఫ్ నజ్రియానే. సుకుమార్ కథ చెప్పడానికి వస్తే అసలు ఏమి అడగకుండానే సినిమా ఓకే చేసేయ్ అని ఆమె చెప్పడం వల్లే ఫహద్ పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెఖావత్ రోల్ కి సైన్ చేశాడు. ఐతే పుష్ప రాజ్ పాత్ర ముందు సినిమాలో అన్నీ తగ్గిపోయాయి. భన్వర్ సింగ్ పుష్ప 1 చివర్లో కాస్త డామినేట్ చేసినట్టు అనిపించినా మళ్లీ ఇది సార్ నా బ్రాండ్ అంటూ అతన్ని అండర్ వేర్ మీద నిలబెడతాడు.
పుష్ప 2 లో భన్వర్ సింగ్ రోల్ ని పుష్ప రాజ్ అవమానించడం.. ఇదంతా ఫహద్ లాంటి ఇమేజ్ ఉన్న వాళ్లు చేయడం వల్ల అతని ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడ్డారు. అదే విషయాన్ని ఫహద్ కూడా ప్రస్తావిస్తూ ఇన్ డైరెక్ట్ గా సినిమా మీద తన అసంతృప్తిని బయటపెట్టాడు.