బిగ్ బాస్ 9.. కావాలనుకుని వెళ్లా.. రావాలనుకుని వచ్చా..!
ఇక మాధురి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో మాధురి కామెంట్స్ మరోసారి షాకింగ్ గా మారాయి.;
బిగ్ బాస్ సీజన్ 9 లో దువ్వాడ మాధురి జర్నీ పూర్తైంది. ఐతే ఈ జర్నీ లో భాగంగా మాధురి అయితే తనతో పెట్టుకుంటే ఎవరైనా ఫైట్ షురూ అన్నట్టుగా ప్రవర్తించింది. కొన్నిసార్లు కాస్త లైన్ క్రాస్ చేసి మాటలు మాట్లాడినట్టు అనిపించింది. నాగార్జున వచ్చి మాధురి మన మాటల వల్లే అందలం ఎక్కుతామని అన్నాడు. ఇక మాధురి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో మాధురి కామెంట్స్ మరోసారి షాకింగ్ గా మారాయి.
ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్ తో మాధురి..
హౌస్ లో మాటల గురించి.. బిగ్ బాస్ లో జరిగిన ఇష్యూపై చర్చించారు శివాజి. ఐతే వాటికి మాధురి ఆన్సర్ సర్ ప్రైజ్ చేశాయి. బిగ్ బాస్ హౌస్ కి కావాలనే వెళ్లా.. రావాలనే వచ్చా అని అన్నారు. అంటే తనకు వెళ్లాలని అనిపించింది కాబట్టే వెళ్లా.. ఎలిమినేట్ అవ్వాలని అనిపించింది అయ్యానని అన్నారు మాధురి. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఉన్నది ఆడియన్ వల్లో.. బిగ్ బాస్ వల్లో కాదు తన ఇష్టం వల్ల అన్నట్టు అర్ధమవుతుంది.
ఇక స్టేజ్ మీద నాగార్జునకు చెప్పినట్టుగా నా భర్త బర్త్ డే ఉంది అందుకే హౌస్ నుంచి బయటకు వచ్చేశా అన్నారు మాధురి. ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్ తో మాధురిని ఎలిమినేట్ చేస్తే ఆమె వెళ్లాలనుకుంది కాబట్టే వెళ్తున్నా అని చెప్పడం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదు.. ఎవరు టాప్ కి వెళ్లాలి అన్నది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఐతే ఈ సీజన్ లో ట్విస్ట్ లు చాలా జరిగాయి. ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ రావడం.. వాళ్లలో ఒకరిని తీసుకోవడం ఊహించలేదు.
వైల్డ్ కార్డ్స్ గా ఫైర్ స్టోర్మ్ తో వచ్చిన మాధురి..
హౌస్ లో వైల్డ్ కార్డ్స్ గా ఫైర్ స్టోర్మ్ తో వచ్చిన మాధురి 3 వారాలు హౌస్ లో ఉండి ఫైనల్ గా తనకు రావాలని అనిపించింది కాబట్టి బయటకు వచ్చా అనడం ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఏది ఏమైనా సరే మాధురి ఎలిమినేషన్ పూర్తైంది. బిగ్ బాస్ బజ్ లో మాధురి ఇంటర్వ్యూ కచ్చితంగా ట్రెండింగ్ లో ఉండేలా ఉంది.
బిగ్ బాస్ సీజన్ 9లో మాధురి ఎంట్రీని కొందరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత సోషల్ మీడియా కాంట్రవర్షియల్ అయ్యిందనిపించినా ఆమె బిగ్ బాస్ కి రావడం పై చాలామంది అసంతృప్తి వ్యక్తపరిచారు. ఐతే హౌస్ లో రెబలిజం తో మాధురి కొన్నిసార్లు అవసరమైన చోట వాయిస్ రేజ్ చేయగా.. మరికొన్నిసార్లు తన లైఫ్ క్రాస్ అయ్యి చిరాకు తెప్పించారు. అందుకే ఆడియన్స్ ఆమెను బయటకు పంపించారు. ఐతే ఇదంతా కూడా తను అనుకున్నా కాబట్టే జరిగింది అనట్టుగా మాధురి చెప్పడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.