'కాంత'కు రిలీజ్ టెన్షన్.. కోర్టుకెక్కిన బయోపిక్ వివాదం!

'కాంత' అనేది ఏ కల్పిత కథో కాదు, ఒకనాటి తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని మాట్లాడుకుంటున్నారు.;

Update: 2025-11-11 16:57 GMT

దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాతగా రూపొందిన 'కాంత' ప్రమోషన్ తో గట్టిగానే సౌండ్ చేస్తోంది. రానా ఈ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కూడా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 1950ల నాటి సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్, దానికి పీరియాడిక్ డ్రామా.. అన్నీ ఫ్యాన్స్‌ను ఎగ్జయిట్ చేస్తున్నాయి. నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు అంతా సెట్ అయిపోయింది. "ఒక కొత్త రకం సినిమా చూస్తారు" అని మేకర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే రిలీజ్‌కు సరిగ్గా మూడు రోజుల ముందు అలా ఊహించని బ్రేక్ పడింది.

కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒక టాక్ గట్టిగా నడుస్తోంది. 'కాంత' అనేది ఏ కల్పిత కథో కాదు, ఒకనాటి తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని మాట్లాడుకుంటున్నారు. "ఏమో, జస్ట్ రూమర్ అయిఉంటుందిలే" అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ రూమరే 'కాంత' టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదం ఏకంగా కోర్టు మెట్లెక్కింది.

ఎం.కె. త్యాగరాజ భాగవతార్ మనవడు, తియాగరాజన్, ఈ సినిమాపై చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. ఇది సింపుల్ పిటిషన్ కాదు, సినిమా రిలీజ్‌ను వెంటనే ఆపాలని, 'కాంత'పై బ్యాన్ విధించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ కుటుంబం అనుమతి లేకుండా, తమ తాత జీవిత చరిత్రను వాడుకున్నారని, అందులో వాస్తవాలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు.

సినిమాలో మా తాతగారిని ఆయన చివరి రోజుల్లో 'అనైతికంగా, 'పేదవాడి'గా చూపించే ప్రయత్నం చేశారు.. అని పిటిషనర్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్ధం. ఆయన చనిపోయే వరకు చాలా గౌరవప్రదంగా, సంపన్నుడిగానే బతికారు. సినిమా కోసం మా ఫ్యామిలీ పరువుకు నష్టం కలిగిస్తున్నారు.. అనేది వాళ్ల మెయిన్ పాయింట్.

ఈ పిటిషన్‌ను కోర్టు సీరియస్‌గానే తీసుకుంది. వెంటనే రెస్పాండ్ అవ్వాలని హీరో దుల్కర్ సల్మాన్, నిర్మాతలకు తదితరులకు నోటీసులు పంపింది. నవంబర్ 18లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. సినిమా రిలీజ్ డేట్ నవంబర్ 14. కోర్టు పెట్టిన డెడ్‌లైన్ నవంబర్ 18. అంటే, రిలీజ్ తర్వాత రెస్పాండ్ అవ్వమన్నారా? లేక ఈ లోపే రిలీజ్‌పై స్టే వచ్చే ఛాన్స్ ఉందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

రిలీజ్‌కు ఇంకా 72 గంటలు కూడా టైమ్ లేదు. ఇలాంటి లాస్ట్ మినిట్ లీగల్ బ్యాటిల్.. ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పి. 'కాంత' టీమ్ ఇప్పటివరకు దీన్ని ఒక ఫిక్షనల్ డ్రామాగానే ప్రమోట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ బయోపిక్ వివాదం వాళ్లను ఇరుకున పెట్టింది. మరి, నవంబర్ 14లోపు కోర్టు నుంచి ఏదైనా స్టే ఆర్డర్ వస్తుందా లేక మేకర్స్ పిటిషనర్‌తో మాట్లాడి సెటిల్ చేసుకుంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News