• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ ఇస్మార్ట్.. అసలు...

డబుల్ ఇస్మార్ట్.. అసలు సౌండ్ కు టైమ్ ఆగయా

| ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా "డబుల్ ఇస్మార్ట్"

By - Tupaki Desk
Update: 2024-06-28 12:39 GMT

 ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా "డబుల్ ఇస్మార్ట్". ఇస్మార్ట్ శంకర్ తో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెల్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్దమైంది. పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల డేట్ పై ఇటీవల పలు రకాల గాసిప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

అసలైతే డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఈ ఏడాది మార్చి లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మధ్యలో పలు కారణాల వలన బ్రేక్ ఇచ్చిన పూరి టీమ్ విడుదల డేట్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా సినిమా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న విడుదల కానుంది.

సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. మేజికల్ కంపోజర్ మణిశర్మ, మొదటి భాగానికి సంగీతం అందించినప్పుడు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ "స్టెప్ మార్" ను జూలై 1న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

ఒక స్ట్రైకింగ్ పోస్టర్ విడుదల చేయగా అందులో రామ్ పోతినేని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ, లార్డ్ శివా విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. ఈ సాంగ్ ఎలక్ట్రిఫయింగ్ ట్యూన్‌గా ఉంటుందట, మాస్ ఆడియెన్స్‌ను వెంటనే ఆకర్షించేలా ఉంటుందని చెబుతున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి వాయిస్ అందించారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఉన్న హైప్ ఆకాశాన్నంటుతోంది. ప్రధాన విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనుండగా, కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ పోతినేని డ్యాన్స్ మూవ్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక "డబుల్ ఇస్మార్ట్" తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

రామ్ మరియు పూరీ జగన్నాథ్ మరోసారి బిగ్ హిట్ అందుకోవాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. "ఇస్మార్ట్ శంకర్" తరువాత ఈ కాంబినేషన్ మరోసారి విజయం సాధిస్తుందా లేదా అనేది ఆసక్తి నెలకొంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.

Tags:    
  • Doubleismart 
  • Rampothineni 
  • Sanjaydutt 
  • Purijagannadh 
  • Charmmekaur 
  • Steppamaar 
  • Doubleismartfirstsingle 
  • Tollywood 

Similar News

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

Copyright @2026

Powered by Blink CMS