ద‌ర్శ‌క‌, నిర్మాత నోటి దురుసుతోనే జాన్వీ క‌పూర్ ఎగ్జిట్?

క‌ర‌ణ్ జోహార్ `దోస్తానా2`ని ఏ మూహూర్తాన మొద‌లు పెట్టాడో గానీ! ఆది నుంచి అవాంత‌రాలు ఎదుర్కోంట‌న్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-10-08 17:30 GMT

క‌ర‌ణ్ జోహార్ `దోస్తానా2`ని ఏ మూహూర్తాన మొద‌లు పెట్టాడో గానీ! ఆది నుంచి అవాంత‌రాలు ఎదుర్కోంట‌న్న సంగ‌తి తెలిసిందే. ముందుగా హీరోగా ఎంపిక చేసిన కార్తీక్ ఆర్య‌న్ పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించి? అత‌డితో వివాదం కార‌ణంగా అర్దంత‌రంగా తొల‌గించడం ఎంత సంల‌చ‌మైందో తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని కార్తీక్ ని అలా తొల‌గించ‌డంతో క‌ర‌ణ్ పై నెటి జ‌నులు తీవ్రంగా మండిప‌డ్డారు. అటుపై ఆ స్థానాన్ని విక్రాంత్ మాస్సేతో భ‌ర్తీ చేసారు. అనంతరం కొన్ని రోజుల‌కు హీరోయిన్ గా ఎంపికైన జాన్వీ క‌పూర్ కూడా ప్రాజెక్ట్ నుంచి మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

క‌ర‌ణ్ తో జాన్వీ ఢీ:

ఇప్పుడా స్థానంలో మ‌రో హీరోయిన్ న‌టిస్తోంది. తెలుగు న‌టి శ్రీలీల‌ను ఎంపిక‌చేసిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే జాన్వీ ఏ కార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది? అన్న‌ది మాత్రం ఇంత వ‌ర‌కూ తెర‌పైకి రాలేదు. డేట్ల స‌ర్దుబాటు విష యంలోనే మ‌రో సినిమాతో క్లాష్ రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న‌ది ప్రాధమికంగా జ‌రిగిన ప్రచారం. కానీ దీని వెనుక అసలు కార‌ణం మ‌రోటి ఉంద‌ని తాజాగా బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జాన్వీపై క‌ర‌ణ్ నోరు జార‌డంతోనే ప్ర‌తిగా జాన్వీ కూడా ధీటుగా బ‌ధులిచ్చే ఎగ్జిట్ అయింద‌న్నది తాజా సమాచారం. దీంతో ఇప్పుడా వార్త ఆస‌క్తిక‌రంగా మారింది.

సెల‌బ్రిటీల్నే భ‌య‌పెట్టే హోస్ట్:

జాన్వీ క‌పూర్ -క‌ర‌ణ్ జోహార్ మ‌ధ్య జ‌రిగిన డిస్క‌ష‌న్ ఏమై ఉంటుంది? అర్దంత‌రంగా వ‌దిలేసి వ‌చ్చేంత‌గా క‌ర‌ణ్ ఏమ‌ని ఉంటాడ‌న్న‌ది చ‌ర్చ‌కు దారి తీస్తోంది. అయితే క‌ర‌ణ్ తీరుపై గ‌తంలో కూడా విమ‌ర్శ‌లున్నాయి. `కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్` షోలో వివాదాస్ప‌ద ప్ర‌శ్న‌లతో సెల‌బ్రిటీల‌ను ఇబ్బంది పెడ‌తాడు? అన్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడ‌టం..అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు సంబంధించి ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం..బోల్డ్ క్శ‌శ్చ‌నింగ్ వంటివి క‌ర‌ణ్ పై పెద్ద మ‌చ్చే వేసాయి. అత‌డి టాక్ షోకి వెళ్లాలంటే సెల‌బ్రిటీలే భ‌య‌ప‌డిపోతారు? అన్న వాదాన చాలా కాలంగా ఉంది.

రెండు చోట్లా బిజీ బిజీ:

క‌ర‌ణ్ నోరు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ లాంటి న‌టులు మాత్ర‌మే మూయించ‌గ‌ల‌ర‌నే అభిప్ర‌కాయం ఉంది. ఇప్పుడా నోటి దురుసే హీరోయిన్లు ప్రాజెక్ట్ లు వ‌దిలి పోయే వ‌ర‌కూ వ‌చ్చిందా? అంటూ డిస్క‌ష‌న్ షురూ అయింది. మ‌రి ఈ ప్రచారం వెనుక వాస్త‌వాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ తెలుగులో `పెద్ది`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. కోలీవుడ్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

Tags:    

Similar News