ఫోటో స్టోరి: పేపర్ చొక్కాలో దివి దుమ్ము దుమారం
కొందరిలో రెబలిజం రకరకాలుగా బయటపడుతుంది. కొందరు చొక్కా పై బటన్ ఓపెన్ చేస్తారు.;
కొందరిలో రెబలిజం రకరకాలుగా బయటపడుతుంది. కొందరు చొక్కా పై బటన్ ఓపెన్ చేస్తారు. మరికొందరు బ్యాక్ లెస్ ఫోజులతో రెచ్చగొడతారు.. ఇంకొందరు పేపర్ చొక్కాల్లో ఇలా మాసిజం ప్రదర్శిస్తారు. మొత్తానికి బోయ్స్ ని టీజ్ చేయడానికి ఉన్న ఏ ఒక్క మార్గాన్ని విడిచిపెట్టడం లేదు సోషల్ మీడియా క్వీన్స్.
ఇప్పుడు దివి వద్యత కూడా న్యూస్ పేపర్ చొక్కాలో ఫోజులిచ్చిన తీరు ఇంటర్నెట్ లో గుబులు పుట్టిస్తోంది. దివి రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా, ప్రస్తుతం ఇవన్నీ ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నాయి. షేక్ పేట నారాయణమ్మ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకున్న రోజుల నుంచి దివి వద్యత ఫ్యాషనిస్టాగా తనను తాను ఎలివేట్ చేసుకుంటూనే ఉంది. బిగ్ బాస్ పార్టిసిపెంట్ గా, నటిగా రాణించిన దివిలోని ఫ్యాషనిస్టా ఇతరుల కంటికి కునుకు పట్టనివ్వదు.
బిగ్ బాస్ సీజన్ లో దివి వద్యతను వీక్షించిన బాస్ చిరంజీవి, నాగార్జున అంతటివారే ఈ బ్యూటీకి తెలుగు చిత్రసీమలో లాంగ్ కెరీర్ ఉందని బ్లెస్ చేసారు. అయితే దివి హవా ఇటీవల ఆశించినంతగా లేదు. బాలకృష్ణ డాకు మహారాజ్ తర్వాత పెద్ద చిత్రాలకు సంతకాలు చేయలేదు. కానీ బుల్లితెర, ఓటీటీల్లోను అవకాశాలొస్తున్నాయని సమాచారం. అయితే దివి వెండితెర క్వీన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. సినీరంగంలో దివి కెరీర్ మరింత పెద్ద స్థాయికి చేరుకోవాలంటే మెగా కాంపౌండ్ సహా, ఇతర హీరోలు తనకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. తెలుగమ్మాయి అందం, ప్రతిభలో మేటి. అందుకే ఈ భామకు గతించిన కాలం ఎలా ఉన్నా, 2026 కలిసొస్తుందనే ఆశిద్దాం.