దిశా ప‌టానీ ఇంటిపై కాల్పులు.. సోద‌రి కార‌ణంగానే?

శ‌నివారం ఉద‌యం బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టానీ ఇంటిపై దుండ‌గుల కాల్పులు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-13 19:40 GMT

శ‌నివారం ఉద‌యం బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టానీ ఇంటిపై దుండ‌గుల కాల్పులు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్ పై వ‌చ్చి దిశా నివ‌శించే అపార్ట్ మెంట్ పై 8 నుంచి 10 రౌండ్లు కాల్పులు జ‌రిపార‌ని ఆమె తండ్రి జ‌గ‌దీష్ ప‌టానీ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం పోలీసులు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దుండ‌గుల‌ను పట్టుకుంటామ‌ని, బాధిత కుటుంబానికి భ‌ద్ర‌త్ క‌ల్పిస్తామ‌ని పోలీసులు ప్రామిస్ చేసారు.

అయితే దిశా పటానీ ఇంటిపై కాల్పుల‌కు అస‌లు కార‌ణం ఏమిటి? అంటే.... దిశా సోద‌రి ఖుష్బూ ప‌టానీ గ‌తంలో ప్రేమానంద్ మ‌హారాజ్ పై చేసిన అనుచిత వ్యాఖ్య‌లే అంటూ ప్ర‌చారం సాగుతోంది. 25 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెళ్లికాని మహిళలు సాధారణంగా వ్యభిచారం చేస్తారని అర్థం వ‌చ్చేలా అనిరుద్ధాచార్య మ‌హారాజ్ చేసిన‌ వ్యాఖ్యలపై ఖుష్బూ పటానీ విమర్శ‌లు గుప్పించారు. ఇది ఆన్‌లైన్‌లో వ్యతిరేకతకు దారితీసింది. ఖుష్బూపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. అయితే త‌న వ్యాఖ్య‌ల వెన‌క సంద‌ర్భం ఏమిట‌న్న‌ది తీసేసి, ప్రేమానంద్ మహారాజ్‌ను ఉద్దేశించి కామెంట్ చేసాన‌ని తప్పుగా ప్రచారం చేసార‌ని జ‌గ‌దీష్ ప‌టానీ స్పష్టం చేశారు.

అయితే దిశా ప‌టానీ సోద‌రి ఖుష్బూ ప‌టానీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుడు అర్థం వ‌చ్చేలా చూపించార‌ని, త‌న‌కు ఎవ‌రినీ ఉద్ధేశ‌పూర్వ‌కంగా అనాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె తండ్రి జ‌గదీష్ ప‌టానీ వ్యాఖ్యానించారు. తన కుమార్తె ప్రకటనను ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్‌తో తప్పుగా అనుసంధానించారని స్పష్టం చేశారు. స్వామీజీల వ్య‌వ‌హారంలోకి నా కుమార్తెను లాగారు. కానీ మేం స‌నాత‌న ధర్మాన్ని అనుస‌రిస్తాం. సాధువులను గౌర‌విస్తాం. ఎవరైనా ఖుష్బూ ప‌టానీ ప్రకటనను తప్పుగా మార్చి చూపిస్తే, అది మమ్మల్ని కించపరిచే కుట్ర`` అని జగదీష్ అన్నారు. దిశా ప‌టానీ ఇంటిపై జ‌రిగిన దాడిలో దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు ఐదు పోలీస్ బృందాలు బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో వాస్త‌వాలేమిట‌న్న‌ది తేల్చేందుకు పోలీసులు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Tags:    

Similar News