దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ బీచ్ లుక్

లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ లో లూజ్ డ‌ఫెల్ జీన్స్ ధ‌రించిన దిశా బ్యాక్ లెస్ ఫోజుల‌తో ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.;

Update: 2025-05-29 17:43 GMT

లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ, ప్ర‌స్తుతం బాలీవుడ్ తో పాటు, సౌత్ లోను భారీ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశాల్ని అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ లో స‌రైన విజ‌యాలు లేక‌పోయినా ఈ బ్యూటీ యూత్ లో నిరంత‌రం ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ల‌క్ష‌లాది ఫ్యాన్స్ కి ట్రీటిస్తోంది.

 

దిశా ప‌టానీ బీచ్ వెకేష‌న్స్ నుంచి ఫోటోషూట్లు ప్ర‌త్యేకం. తాజాగా దిశా పటానీ ఇన్‌స్టా ఫోటో చూస్తుంటే, మొనాకో గ్రాండ్ ప్రిక్స్‌లో వీక్షణను ఆస్వాధిస్తోంది ఈ భామ‌. దీనికి అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది. ఇది ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌. పాపుల‌ర్ ఖ‌తార్ ఎయిర్ వేస్ కి సంబంధించిన ప్ర‌చారం.

లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ లో లూజ్ డ‌ఫెల్ జీన్స్ ధ‌రించిన దిశా బ్యాక్ లెస్ ఫోజుల‌తో ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. దిశా స్ట‌న్న‌ర్ అని మ‌రోసారి నిరూపించింది. దిశా ఎంపిక చేసుకున్న ఫ్యాంటుకు త‌గ్గ‌ట్టే డిజైన‌ర్ టాప్ వీలున్నంత పొదుపుగా క‌నిపించింది. ఇక క‌ళ్ల‌కు గ్లాసెస్ ధ‌రించి స్టైలిష్ గా ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం దిశా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. క‌ల్కి సీక్వెల్ త‌ర్వాత దిశా ప‌టానీ సూర్య కంగువ‌లో న‌టించింది. కానీ ఈ చిత్రం నిరాశ‌ప‌రిచింది. త‌దుప‌రి ఏక్తాక‌పూర్ తో సినిమా చేయాల్సి ఉన్నా దాని గురించిన వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రాలేదు.

Tags:    

Similar News