దిశా జంప్.. మాజీ ప్రియుడి శిక్ష‌ణ ఫ‌లితం!

త‌న‌దైన అందం, తీరైన రూపంతో క‌ట్టి ప‌డేయ‌డంలో దిశా ప‌టానీ త‌ర్వాతే. ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ కోసం ఈ బ్యూటీ హార్డ్ వ‌ర్క్ అంతా ఇంతా కాదు.;

Update: 2025-05-17 12:08 GMT

త‌న‌దైన అందం, తీరైన రూపంతో క‌ట్టి ప‌డేయ‌డంలో దిశా ప‌టానీ త‌ర్వాతే. ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ కోసం ఈ బ్యూటీ హార్డ్ వ‌ర్క్ అంతా ఇంతా కాదు. జిమ్, యోగా సెష‌న్స్‌ని అస్స‌లు మిస్ కాదు. దీనికి తోడు మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్, బాక్సింగ్ స‌హా ప‌లు సాహ‌సోపేత‌మైన క్రీడ‌ల్లో ఆరి తేరింది దిశా. ఇంత‌కుముందు మాజీ ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ చాలా వ‌ర‌కూ ఇలాంటి విద్య‌ల్లో దిశాకు శిక్ష‌ణ‌నిచ్చాడు.

గాల్లో ఎగిరి స్టంట్స్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం దిశాకు ఉంది. ఒక రియ‌ల్ టైమ్ బాక్స‌ర్ లా శ‌త్రువుపై విరుచుకుప‌డే ప్ర‌తిభ, క‌ఠిన‌త్వం త‌న‌కు ఉంది. దీనికి దిశా ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్ స‌హ‌క‌రిస్తుంది. అందుకే దిశాను కేవ‌లం గ్లామ‌ర్ అనే కోణంలో మాత్ర‌మే చూస్తే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఈ బ్యూటీ ఆల్ రౌండ‌ర్ ప‌నిత‌నం, గ‌ట్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చెట్టు పుట్టా వెంట డ్యాన్సులు వేయ‌డం, స్విమ్ సూట్లు, బికినీల‌తో యూత్ ని వెర్రెక్కించ‌డ‌మే కాదు, ఇంకా చాలా కోణాల్లో దిశా స్ట‌న్నింగ్ ట్యాలెంట్ అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది.

తాజాగా దిశా త‌ల‌కిందులుగా క‌స‌ర‌త్తులు చేస్తూ క‌నిపించి షాకిచ్చింది. ఈ వీడియో ప్ర‌కారం.. దిశా జిమ్‌లో రివర్స్ జంప్ చేసింది. దీనికి సింపుల్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. `ప్రతిరోజూ తేడాను కలిగిస్తుంది!` అనేది క్యాప్షన్. సుశిక్షితుడైన కోచ్ స‌మ‌క్షంలో మాత్ర‌మే ఇలాంటి ఫీట్స్ వేయాలి. కానీ దిశా ఎక్స్ ప‌ర్ట్ లా త‌ల‌కిందులుగా జంప్ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్ప‌ష‌ల్ వీడియో, ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

క‌ల్కి 2898 ఏడి త‌ర్వాత దిశా ప‌టానీ న‌టించిన వెల్ కం టు ది జంగిల్ విడుద‌ల‌కు రావాల్సి ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్ కి ఇంకా టైమ్ ప‌డుతుంది. ఇంత‌లోనే దిశా ప‌టానీ త‌న స్నేహితురాలు ఏక్తాక‌పూర్ తో క‌లిసి భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News