ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్న మాస్టర్ మైండ్స్!

ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కంటే కూడా దర్శకుల మధ్యే అసలైన పోటీ మొదలైపోయింది.;

Update: 2025-04-10 01:30 GMT

ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కంటే కూడా దర్శకుల మధ్యే అసలైన పోటీ మొదలైపోయింది. అంతకంతకు భారీగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంటున్నారు. స్కేల్‌, విజన్‌, టెక్నాలజీ పరంగా ఇప్పుడు దర్శకులే అసలైన హీరోలు అని చెప్పొచ్చు.

ఇందులో ముందున్న పేరు ఎస్‌ఎస్ రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ ఆధారంగా మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను టార్గెట్ చేసిన స్టోరీతో, హాలీవుడ్ స్టైల్ టెక్నికల్ ట్రీట్‌మెంట్‌తో రాజమౌళి ఈసారి అంతరిక్షం నుంచి అడవుల దాకా వెళ్లే యాత్రను తెరపై ఆవిష్కరించనున్నాడు.

ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా తన స్పీడ్ తగ్గించకుండా ముందుకెళ్తున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌తో తెరకెక్కుతున్న "స్పిరిట్" అనే సినిమా కాప్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఇది యాక్షన్‌తో పాటు ఇంటెన్స్ ఎమోషన్లను మిళితం చేసే యూనివర్సల్ కాన్సెప్ట్‌తో వస్తోంది. సందీప్ స్టైల్‌లో మానసిక ఆవేశాలు, బలమైన పాత్రల డెవలప్‌మెంట్ ఉండటం గ్యారంటీ.

మరో పక్క కమర్షియల్ సినిమాలకు కింగ్‌గా పేరు తెచ్చుకున్న అట్లీ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఏకంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో వీఎఫ్‌ఎక్స్, డిజిటల్ డీ ఏజింగ్ వంటి టెక్నికల్ ట్రీట్మెంట్స్ ప్రపంచ స్థాయిలో ఉండబోతున్నాయి. ఇప్పటివరకు అందరూ ఊహించనిది అనిపించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఇక బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న రణబీర్ కపూర్, సాయి పల్లవిల లుక్స్ వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌, టాప్ టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు భారతీయ మైత్రి సాంస్కృతిక ప్రతీకగా ఉండే అవకాశముంది.

ఈ నాలుగు సినిమాలు మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేదికే ఇప్పుడు టెక్నికల్ గా, క్రియేటివ్ గా అద్భుతమైన ప్రయోగాలకు వేదికవుతోంది. దర్శకులు కథను ఎలా చెప్పాలి అన్నదానికే కాకుండా, ప్రేక్షకుడిని ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కనెక్ట్ చేసేవిధంగా సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. హీరోల కంటే దర్శకులే ఇప్పుడు నాంది పలుకుతున్న కాలం ఇది. మరి రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News