స్టార్ హీరో కొడుకు అంత క్లోజా!
ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపాడు. ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ప్రెండ్ శౌర్యువ్ అని తెలిపాడు. శౌర్యువ్ ఎవరు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.;
చియాన్ విక్రమ్ తనయుడు ఎట్టకేలకు బైసన్ తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. `ఆదిత్యవర్మ`, `వర్మ`, `మహాన్`, లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో? ధృవ్ సక్సెస్ అవుతాడా? లేదా? అని ఎన్నో సందేహాలు తలెత్తాయి. తండ్రి పెద్ద స్టార్ అయినా? తనయుడు మాత్రం విజయానికి దూరంగా ఉండటంతో? చివరికి విక్రమ్ కూడా తనయుడి కోసం రంగంలోకి దిగాల్సి వచ్చింది. తనయుడి విషయంలో కేరింగ్ మరింత పెంచాడు విక్రమ్. మరి ఆ ఫలితమో? ధృవ్ కష్టమో తెలియదు గానీ ఎట్టకేలకు బైసన్ తో భారీ విజయాన్నే అందుకున్నాడు.
భారీ విజయంతో ధృవ్:
30 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన `బైసన్` భారీగానే వసూళ్లను సాధించింది. దీంతో చియన్ సహా దృవ్ అంతా సంతోషంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఇదే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాని దృవ్ ప్రచారం చేస్తున్నాడు. దీనిలో భాగంగా తెలుగు సైతం ఎంతో స్వచ్ఛంగా మాట్లాడటం విశేషం. పరభాష నటులైనా రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ లాంటి నటులే తెలుగు అనర్గళంగా మాట్లాడలేరు. కానీ దృవ్ మాత్రం రాసి ఇచ్చింది చూసి చదివినా? ఎంతో చక్కాగా చూసి మాట్లాడాడు.
వారిద్దరి స్నేహం అలా:
అది రాసింది దర్శకుడు శౌర్యువ్ అని తెలిసింది. అవును శౌర్యువ్ ..దృవ్ కి చాలా కాలంగా మంచి స్నేహితుడు అట. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపాడు. ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ప్రెండ్ శౌర్యువ్ అని తెలిపాడు. శౌర్యువ్ ఎవరు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. `హాయ్ నాన్న` తో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమా తోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. మరి దృవ్-శౌర్యువ్ స్నేహం ఎలా అంటే? శౌర్యువ్ తమిళ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అలాగే ధృవ్ తొలి సినిమా `ఆదిత్య వర్మ`కు కూడా శౌర్యువ్ పని చేసాడు.
హీరోలంతా బిజీగా ఉండటంతో:
అలా ఇద్దరి మధ్య తొలిసారి పరిచయం ఏర్పడింది. శౌర్యువ్ తెలివైన వాడు కావడంతో? ధృవ్ అతడితో స్నేహాన్ని కొనసాగించాడు. ఇద్దరు కలిసి సినిమా చేయలేదు కానీ భవిష్యత్ లో చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. `హాయ్ నాన్న` తర్వాత శౌర్యువ్ మరో సినిమా డైరెక్ట్ చేయని సంగతి తెలిసిందే. హీరోలంతా బిజీగా ఉండటంతో శౌర్యువ్ కి అవకాశం రావడం లేదు. ఇప్పటికే తాను కొన్ని కథలు సిద్దం చేసి పెట్టుకున్నాడు. కొంత మంది హీరోలకు వినిపించాడు. కానీ హీరోల బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది.