రైట‌ర్ల‌ పై రాజ‌కీయ ముద్ర క‌ళ‌కు శాపంగా!

భిన్నమైన అభిప్రాయాలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా సినిమాను తొలగించాల్సి వచ్చిందని పేర్కొంటున్నాయి.

Update: 2026-07-07 07:49 GMT

బాలీవుడ్ న‌టుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన `సట్లూజ్` (గతంలో పంజాబ్ 95) సినిమా విడుదల ..ఆ చిత్రాన్ని తొలగించిన తీరు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర రచయిత నిరేన్ భట్ సినిమా పట్ల జరుగు తోన్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండానే సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రం జస్వంత్ సింగ్ ఖల్లా అనే మానవ హక్కుల కార్యకర్త జీవితం ఆధారంగా రూపొందింది. అయితే సెన్సార్ బోర్డు నుండి సరైన వివరణ రాకుండానే సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం కావడం సదరు రచయితను ఆశ్చర్యపరిచింది.

ఒక సృజనాత్మక కళాఖండాన్ని ఎందుకు నిలిపివేస్తున్నారో? చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నిరేన్ వాదించారు. సినిమాపై దేశ వ్యతిరేక ముద్ర వేయడం పట్ల నిరేన్ భట్ తీవ్రంగా స్పందించారు. ఒక బయోపిక్ లేదా చారిత్రక అంశం ఆధారంగా తీసిన సినిమాను ఎలా? దేశ వ్యతిరేక చిత్రంగా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఇది క‌క్ష పూరిత‌ వాదనగా అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో `ది కశ్మీర్ ఫైల్స్`, `ది కేరళ స్టోరీ` లాంటి చిత్రాలను ఉదహరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాజంలో భాగమై ఉన్నప్పుడు తమ సినిమాను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని నిలదీశారు.

భిన్నమైన అభిప్రాయాలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా సినిమాను తొలగించాల్సి వచ్చిందని పేర్కొంటున్నాయి. అయితే ఎలాంటి పారదర్శకత లేకుండా జరిగిన పరిణామాలు సృజనాత్మక స్వేచ్ఛపై పడుతున్న ప్రభావం గురించి పరిశ్రమలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే ఇలాంటి అస్పష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిరేన్ భావిస్తున్నారు.

ఎంటర్టైన్మెంట్ రంగంలో పనిచేసే వారిపై రాజకీయ ముద్ర వేయడం వల్ల కళాత్మక విలువలకు ఆటంకం కలుగుతుందని భట్ ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శలు చేసే ముందు ఆ కంటెంట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని గమనించాలని సూచించారు. సృజనాత్మకతకు, వివాదాలకు మధ్య ఉన్న గీతను గుర్తించడం ముఖ్యమని నిరేన్ భట్ వ్యాఖ్యానించారు. తాము ఎప్పుడూ దేశహితాన్ని కోరుకునే కథలనే ఎంచుకుంటామని కానీ కథా గమనం కోసం వాస్తవికతను చూపించడం అవసరమని చెప్పారు. విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి రాజ‌కీయ ముద్రలు క‌ళ‌కు శాపంగా మారుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.

Tags:    

Similar News