'విశ్వనాథ్ & సన్స్'లో గజినీ వైబ్? నాగ వంశీ హింట్!

దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం 'లక్కీ భాస్కర్' యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.

Update: 2026-07-07 09:23 GMT

సూర్య హీరోగా 'లక్కీ భాస్కర్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ చిత్రంలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఈ క్యారెక్టర్ పేరు వినగానే సూర్య కెరీర్‌లోనే మైల్డ్‌స్టోన్‌గా నిలిచిన ‘గజని’ మూవీలోని ‘సంజయ్ రామస్వామి’ పాత్ర నెటిజన్లకు గుర్తొస్తోంది. ఈ అంశంపై నిర్మాత నాగ వంశి రీసెంట్‌గా రియాక్ట్ అయ్యి, కొన్ని ఇంట్రెస్టింగ్ హింట్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

20 ఏళ్ల అమ్మాయి.. 40 ఏళ్ల అబ్బాయి లవ్ స్టోరీ:

ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల వయసున్న ఒక ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్‌గా నటిస్తున్నారు. ఆయన సరసన క్రేజీ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. "గజని సినిమా అంటే తెలుగు ఆడియన్స్‌కు ఒక ఎమోషన్. ఆ చిత్రంలో సూర్య చూపించిన క్లాస్ అండ్ స్టైలిష్ వైబ్‌ను ఈ సినిమాలో కూడా ప్రేక్షకులు చూస్తారు. ముఖ్యంగా 20 ఏళ్ల అమ్మాయి, 40 ఏళ్ల అబ్బాయిని ఎలా ఆటపట్టించింది, ఎలా ప్రేమలో పడేసిందనే ఫన్ అండ్ లవ్ ట్రాక్ సినిమాకు మెయిన్ హైలైట్" అని చెప్పుకొచ్చారు.

థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టడం ఖాయం:

దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం 'లక్కీ భాస్కర్' యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. అదే నమ్మకంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని కూడా పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో, మంచి హ్యూమర్ అండ్ ఎమోషన్స్‌తో లవ్ స్టోరీగా ప్లాన్ చేశారని నిర్మాత తెలిపారు. ఇక సూర్య మార్క్ స్టైల్, మమితా బైజు నటనతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.

సితార బ్యానర్‌లో రిచ్ కంటెంట్ మూవీ:

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ వంటి సీనియర్ తారలు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆగస్టు 14న థియేటర్లలో సందడి:

నిర్మాత నాగవంశీ ఇచ్చిన హింట్స్ చూస్తుంటే సూర్య వింటేజ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం 'గజని' రేంజ్ మ్యాజిక్‌ను రిపీట్ చేసి సూర్య కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందో లేదో చూడాలి..

Tags:    

Similar News