రణవీర్ 'ధురంధర్'.. నెక్స్ట్ బిగ్ టార్గెట్స్ అవేనా?

ధురంధర్ తర్వాత పలు సినిమాలు రిలీజ్ అయినా.. వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ రన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ధురంధర్.;

Update: 2026-01-06 05:28 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రీసెంట్ గా ధురంధర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. 2025 డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఆ మూవీ.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

రిలీజ్ అయిన నెల రోజులు దాటినా.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతోంది. ధురంధర్ తర్వాత పలు సినిమాలు రిలీజ్ అయినా.. వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ రన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ధురంధర్.

అయితే ప్రస్తుతం రోజుకు డబుల్ నెంబర్ లో వసూళ్లు నమోదవుతుండడం విశేషం. ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టి.. వివిధ ఘనతలు అందుకున్న ధురంధర్ మూవీ.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. అందుకు గాను ఇప్పటికే ధురంధర్ బిగ్ టార్గెట్స్ పెట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ముందుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా ఘనత అందుకునేందుకు సిద్ధమవుతోంది ధురందర్. ఇప్పటికే ఆ రికార్డు.. బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప 2 పేరిట ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా.. కేవలం ఇండియాలోనే రూ.830 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్ ప్లేస్ కు చేరుకుంది.

అయితే ఇప్పటికే ధురంధర్.. ఇండియాలో రూ.820 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మరికొన్ని రోజుల్లో పుష్ప-2 రికార్డును బ్రేక్ చేయడం పక్కా అనేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా ఘనత.. తెలుగు మూవీ పేరిట ఉండగా.. దాన్ని మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ మూవీ అందుకోనుందని చెప్పాలి.

అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఫుల్ రన్ లో ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.1230 కోట్లకు పైగా వసూలు చేసి రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఆ ప్రతిష్టాత్మక క్లబ్ లో నాలుగో ప్లేస్ ను దక్కించుకుంది.

అయితే ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధురంధర్ మూవీ.. వివిధ చిత్రాలను వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను అధగమించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. మరికొద్ది రోజుల్లో ఆర్ఆర్ఆర్ ను డామినేట్ చేయనుంది. దంగల్, బాహుబలి 2, పుష్ప 2 సినిమాల తర్వాత నాలుగో స్థానాన్ని సంపాదించుకోనుంది.

Tags:    

Similar News