ధురంధర్@రూ.1220 కోట్లు.. ఫస్ట్ మూవీగా మరో ఘనత

ఇప్పటివరకు రూ.1220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ధురంధర్.. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా అరుదైన ఘనత సాధించింది.;

Update: 2026-01-07 12:47 GMT

ధురంధర్.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆ మూవీ కోసమే చర్చ నడుస్తోంది. ఎలాంటి సౌండ్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలై నెల రోజులు దాటినా.. ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ తగ్గేదేలే అన్నట్లు రాణిస్తోంది.

ఇప్పటివరకు రూ.1220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ధురంధర్.. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా అరుదైన ఘనత సాధించింది. ఒకే లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మేరకు మూవీ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇండియన్ సినిమాకు ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు అంటూ రాసుకొచ్చింది.

అత్యధిక వసూళ్లు సాధించిన సింగిల్ లాంగ్వేజ్ మూవీగా ధురంధర్ చరిత్ర సృష్టించిందని మూవీ టీమ్ తెలిపింది. అంతే కాదు.. డైరెక్టర్ ఆదిత్య ధర్ పై ప్రశంసలు కురిపించింది. ఆ స్టోరీపై పెట్టుకున్న నమ్మకం, స్టోరీ నెరేట్ చేసిన విధానం, ఆయన కమిట్మెంట్.. ఇండియన్ మూవీకి కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేశాయని కొనియాడింది. ధురంధర్ సక్సెస్ టీమ్ కష్టానికి రిజల్ట్ అని, ఎన్నో మూవీలకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది.

ఇక సినిమా విషయానికొస్తే, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో ఆదిత్య ధర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. బీ62 స్టూడియోస్ బ్యానర్ పై ఆయనే నిర్మించారు. సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన మూవీ.. రూ.28.60 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో వసూళ్లు ఫుల్ గా పెరిగాయి.

తొలి వారం కంప్లీట్ అయ్యేసరికి రూ.218 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ధురంధర్.. రెండో వారానికి రూ.479.50 కోట్ల వసూళ్లు సాధించింది. 15వ రోజుకు రూ.500 కోట్ల క్లబ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. 30 రోజుల్లో ఇండియాలో రూ.831.40 కోట్ల వసూళ్లను రాబట్టింది. నెల రోజులు కంప్లీట్ అయినా సినిమా జోరు తగ్గలేదు. 32వ రోజు రూ.5.40 కోట్లు, 33వ రోజు రూ.5.70 కోట్లు వసూలు చేయడం విశేషం.

దీంతో ధురంధర్ కు ఆదరణ ఇంకా కొనసాగుతోందని క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.1220 కోట్లు రాబట్టిన ఆ సినిమా.. ఆకట్టుకునే కంటెంట్ తో భారీ బడ్జెట్ సినిమాలకు గట్టి పోటీనిస్తూ సందడి చేస్తోంది. మరి ఫుల్ రన్ లో ధురంధర్ ఎంత రాబడుతుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News