రణవీర్ సింగ్.. 8 ఏళ్ల తర్వాత అక్కడ ప్రభాస్ రికార్డు బ్రేక్..
బాహుబలి-2 తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అంతటి రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేదు. ఆ మార్క్ ను కూడా అందుకోలేదు.;
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రీసెంట్ గా ధురంధర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ నిడివి ఉన్న సినిమాగా నిలిచిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రిలీజైన మూడు రోజుల్లో రూ.100 కోట్లు సాధించింది.
డిసెంబర్ 5వ తేదీన ధురంధర్ మూవీ విడుదలవ్వగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.252.70 కోట్లు వసూలు చేసింది. రూ.300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. అయితే ఇప్పుడు ధురంధర్ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి 2 నమోదు చేసిన రికార్డును ఇప్పుడు ధురంధర్ బ్రేక్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా అదిరిపోయే రీతిలో అలరించింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఉత్తర అమెరికాలో సినిమా రిలీజ్ అయ్యాక రెండో శుక్రవారం భారీ ఎత్తున 828,000 డాలర్ల వసూళ్లను బాహుబలి-2 సాధించింది.
బాహుబలి-2 తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అంతటి రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేదు. ఆ మార్క్ ను కూడా అందుకోలేదు. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత బెంచ్ మార్క్ ను ధురంధర్ మూవీ అధిగమించింది. అయితే నార్త్ అమెరికాలో బాహుబలి 2 మూవీ.. కంప్లీట్ థియేట్రికల్ రన్ లో 22 మిలియన్ డాలర్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే..
తద్వారా అక్కడ ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ధురందర్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందా లేదా అన్న విషయంపై రేగుతోంది. అయితే ధురంధర్ మూవీ అక్కడ మొదటి వారం వసూళ్లు 4.4 మిలియన్ డాలర్లుగా నమోదవ్వగా, ఇప్పటి వరకు 5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది.
ఇక సినిమా విషయానికొస్తే.. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ధురంధర్ కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రణవీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్ పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్ భారీ బడ్జెట్ తో రూపొందించారు.