స్టార్ హీరో తనయుడు మరోటి లాక్!
తమిళ్ లో సక్సస్ అయిన నేపథ్యంలో తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుంది? అన్న నమ్మకంతో టీమ్ ఉంది. ఈ నేపథ్యంలో ధృవ్ తెలుగులో సైతం మాట్లాడే ప్రయత్నం చేసి ఆడియన్స్ కు రీచ్ అయ్యాడు.;
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ `బైసన్` తో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ధృవ్ కెరీర్ లో నమోదైన అసలైన సక్సస్ ఇది. దీంతో ధృవ్ సహా కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇదే చిత్రాన్ని తెలుగులోనూ అనువదించి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారం కోసం ధృవ్ అండ్ కో హైరాబాద్ వచ్చి ప్రచారం చేస్తోన్ సంగతి తెలిసిందే. తమిళ్ లో సక్సస్ అయిన నేపథ్యంలో తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుంది? అన్న నమ్మకంతో టీమ్ ఉంది. ఈ నేపథ్యంలో ధృవ్ తెలుగులో సైతం మాట్లాడే ప్రయత్నం చేసి ఆడియన్స్ కు రీచ్ అయ్యాడు.
డిసెంబర్ నుంచి మొదలు:
ఈ నేపథ్యంలో ధృవ్ తదుపరి చిత్రాలకు సంబంధించి ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే `డాడా` ఫేం గణేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే గణేష్ స్టోరీ వినిపించ డం..నచ్చడంతో ధృవ్ ఒకే చేయడం జరిగిందిట. ఇదే స్టోరీని విక్రమ్ కూడా విని ఒకే చేసారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ నుంచి పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట. అలాగే `హాయ్ నాన్న` ఫేం శౌర్యువ్ కూడా ధృవ్ కి మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే.
క్లోజ్ ప్రెండ్ తో ధృవ్ సినిమా:
ధృవ్ తొలి సినిమా నుంచే శౌర్యువ్ తో మంచి పరిచయం ఉంది. ఆ సినిమాకు శౌర్యువ్ అసిస్టెంట్ గా పనిచేసాడు. అతడిలో ట్యాలెంట్ ను గుర్తించి ధృవ్ అప్పటి నుంచి క్లోజ్ గా మూవ్ అవ్వడం మొదలు పెట్టాడు. తెలుగు స్పీచ్ కూడా రాసిచ్చింది శౌర్యువ్ నే. అలాంటి క్లోజ్ ప్రెండ్ తో దృవ్ సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శౌర్యువ్ కూడా వెరీ ట్యాలెంటుడ్. అతడు ఎంతటి ప్రతిభావంతుడు ?అన్నది హాయ్ నాన్నతో ప్రూవ్ అయింది. నాని హీరోగా నటించిన సినిమా కమర్శియల్ వర్కౌట్ కానప్పటికీ విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది.
గణేష్ తర్వాత హాయ్ నాన్న దర్శకుడితో:
మంచి రైటర్ గా శౌర్యవ్ కి పేరొచ్చింది. శౌర్యువ్ తదుపరి సినిమా కూడా నానితోనే ఉంటుందని వార్తలొస్తున్నాయి. అలాంటి ప్రతిభావంతుడిని ధృవ్ ఎందుకు వదులుకుంటాడు? గణేష్ తర్వాత ధృవ్ తదుపరి సినిమా శౌర్యువ్ తో ఉన్నా? ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం శౌర్యువ్ టాలీవుడ్ హీరోలకు కథలు వినిపించే పనిలో బిజీగా ఉన్నాడు. అతడితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.