ధృవ్ విక్రం తెలివైన వాడే..!

ఎవరైనా మన సొంత భాషలో మాట్లాడితే చూసేందుకు బాగుంటుంది. ధృవ్ కూడా బైసన్ కోసం తెలుగులో మాట్లాడేందుకు మంచి ప్రయత్నం చేశాడు.;

Update: 2025-10-22 04:31 GMT

చియాన్ విక్రం తనయుడు ధృవ్ విక్రం ఇప్పటికే తమిళ్ లో రెండు ప్రయత్నాలు చేశాడు. ఐతే లేటెస్ట్ గా అతను లీడ్ రోల్ లో మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బైసన్. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న తమిళంలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 24న బైసన్ తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ధృవ్ విక్రం తన టీం తో సహా హైదరాబాద్ వచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ధృవ్ విక్రం స్పీచ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ధృవ్ కూడా బైసన్ కోసం తెలుగులో..

ఎవరైనా మన సొంత భాషలో మాట్లాడితే చూసేందుకు బాగుంటుంది. ధృవ్ కూడా బైసన్ కోసం తెలుగులో మాట్లాడేందుకు మంచి ప్రయత్నం చేశాడు. తాను ఎలా రాసుకొచ్చాడో తెలియదు కానీ పేపర్ చూస్తూ తెలుగులో మాట్లాడిన విధానం ఇంప్రెస్ చేసింది. తెలుగు ఆడియన్స్ ప్రేమ పొందడానికి ధృవ్ వేసిన తొలి అడుగు బైసన్.

మాట్లాడటం మొదలు పెట్టడమే మీడియా వాళ్లకు థాంక్స్ చెప్పిన ధృవ్ హైదరాబాద్ లో ఒక షాప్ లో సూట్ కేస్ కొనేందుకు వెళ్తే అక్కడ తనని షాప్ ఓనర్ గుర్తుపట్టకపోతే ఎవరో కొందరు వచ్చి ధృవ్ కోసం ఎదురుచూస్తుంటే వాళ్లు నీ ఫ్రెండ్సా అని అడిగితే కాదు అని అన్నాడట.

తెలుగు ప్రేక్షకులు ఫుడ్, సినిమాలు ఇష్టపడతారు..

అప్పుడు మీరు యాక్టరా అంటే అవునని అంటే.. కాస్త గడ్డం చూసి మీరు విక్రం లా ఉన్నారని అంటే.. నేను ఆయన కొడుకునే అని చెప్పాడట ధృవ్. అప్పుడు అతను విక్రం చాలా గొప్ప నటుడు.. ఆయన అంటే ఇష్టమని చెప్పాడట. తెలుగు ప్రేక్షకులు ఫుడ్, సినిమాలు ఇష్టపడతారు. బైసన్ తో మీ ముందుకు వస్తున్నా.. నాన్న గారిని ఎన్నో ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్నారు. అదే ప్రేమ నాకు ఇస్తారని ఆశిస్తున్నా. ఎప్పుడో ఒకసారి నా కొడుకు కూడా అలా ఒక మాల్ కి వెళ్లి షాప్ ఓనర్ తో నేను ధృవ్ కొడుకుని అని చెప్పుకునేలా కష్టపడతానని అన్నాడు.

మొదట్ స్పీచ్ లోనే అటు తన కష్టాన్ని చెబుతూనే తన టార్గెట్ ని వ్యక్తపరిచాడు ధృవ్. తొలి ప్రయత్నాలు ఎలా ఉన్నా కూడా బైసన్ కోసం తను రియల్ కబడ్డీ ట్రైనింగ్ అయ్యి సినిమా చేశాడు. బైసన్ సినిమాకు తమిళ్ లో సూపర్ హిట్ టాక్ రాగా ఇప్పుడు తెలుగులో ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో చూడాలి. బైసన్ సినిమాను తెలుగులో నితిన్ శ్రేష్థ్ మూవీస్ ద్వారా రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News