వడ చెన్నై- 2పై ఆశలు పెంచిన డైరెక్టర్.. ఈ సారైనా పట్టాలెక్కుతుందా?

తమిళ నటుడు ధనుష్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రేక్షకుల అభిమానానికి తగ్గట్టుగానే ధనుష్ కూడా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తున్నారు;

Update: 2025-08-31 01:30 GMT

తమిళ నటుడు ధనుష్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రేక్షకుల అభిమానానికి తగ్గట్టుగానే ధనుష్ కూడా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తున్నారు. ఈ మధ్యనే 'కుబేర' సినిమాతో హిట్ కొట్టిన ఈయన.. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ధనుష్ నటించిన 'వడ చెన్నై' సీక్వెల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు రావడానికి కారణం వడా చెన్నై డైరెక్టర్ చేసిన కామెంట్లే. మరి ఇంతకీ డైరెక్టర్ ఏం మాట్లాడారు? వడ చెన్నై సీక్వెల్ ఉన్నట్టా? లేనట్టా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వడ చెన్నై సీక్వెల్ పై మళ్లీ ఆశలు పెంచిన డైరెక్టర్..

కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ వడ చెన్నై.. ఈ మూవీకి సీక్వెల్ వస్తుంది అని గత కొద్ది సంవత్సరాల నుండి ప్రచారం జరుగుతోంది..ఇప్పటికే ఈ సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సీక్వెల్ గురించి రూమర్లు రావడమే తప్ప ఒక్కటి కూడా నిజమవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్. వెట్రిమారన్ మాట్లాడుతూ.." ప్రస్తుతం నేను శింబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పూర్తవ్వడంతోనే ధనుష్ వడ చెన్నై -2 సినిమా గురించి అప్డేట్ ఇస్తానంటూ" క్లారిటీ ఇచ్చారు..

నమ్మకం లేదు అంటున్న ఫ్యాన్స్..

అయితే ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ శింబుతో కలిసి STR 49 అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అయిపోయాక ధనుష్ తో కలిసి వర్క్ చేస్తానని వెట్రిమోరన్ చెప్పినప్పటికీ అభిమానులు మాకు నమ్మకం లేదు దొరా అన్నట్లుగా రిప్లై ఇస్తున్నారు. ఎందుకంటే ధనుష్ సినిమా గురించి వెట్రిమారన్ గత మూడు సంవత్సరాల నుండి అభిమానులకు హామీ ఇస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ధనుష్ మూవీ గురించి సరైన అప్డేట్ ఇవ్వలేదు. దాంతో చాలామంది అభిమానులు వడ చెన్నై-2 మూవీపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ధనుష్ అయినా క్లారిటీ ఇస్తారా?

అలాగే అటు వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న ధనుష్ కూడా వడ చెన్నై మూవీ సీక్వెల్ గురించి ఏ ఈవెంట్ లో కూడా నోరు విప్పకపోవడంతో చాలామంది ఈ సినిమా సీక్వెల్ ఇప్పట్లో లేనట్టే అని నిరాశ పడుతున్నారు.. మరి దర్శకుడు వెట్రిమారన్ ఇప్పటికైనా స్పందించి వడ చెన్నై మూవీ సీక్వెల్ గురించి ఖచ్చితమైన అప్డేట్ ఇస్తారా? అనేది చూడాలి. ధనుష్ ఈ మధ్యనే కుబేర సినిమాతో హిట్ కొట్టారు.అలాగే ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు.

ధనుష్ మూవీ లైనప్..

ప్రస్తుతం ధనుష్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇడ్లీ కడై సినిమాతో పాటు ఆయన బాలీవుడ్ లో తేరే ఇష్క్ మే కథ, విగ్నేష్ రాజా డైరెక్షన్లో D54, ఓం రౌత్ డైరెక్షన్ లో కలాం, రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్లో D55, మారి సెల్వరాజ్ డైరెక్షన్లో D56 వంటి వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టారు.అలాగే అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్లో ఇళయరాజా బయోపిక్ లో కూడా ధనుష్ నటిస్తున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News