మెగాస్టార్ కి ధనుష్ పాదాభివందనం!
కోలీవుడ్ లో ధనుష్ పెద్ద స్టార్. టాప్-5 హీరోల్లో అతనొకరు. కోట్లాది మంది అభిమానులున్న స్టార్. బాలీవుడ్ లోనూ ధనుష్ సినమాలంటే ఎంతో ప్రత్యేకమైనవి.;
కోలీవుడ్ లో ధనుష్ పెద్ద స్టార్. టాప్-5 హీరోల్లో అతనొకరు. కోట్లాది మంది అభిమానులున్న స్టార్. బాలీవుడ్ లోనూ ధనుష్ సినమాలంటే ఎంతో ప్రత్యేకమైనవి. కోలీవుడ్ నటుల్లో హిందీ మార్కెట్ లో టాప్ లో ఉన్న నటుడాయన. తెలుగులోనూ ధనుష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతటి స్టార్ నిన్నటి రోజున మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కరించడం అన్నది ఎంత గొప్ప విషయం.
చిరంజీవి ఆశీస్సులు అందుకుని ధనుష్ ఎంతో సంతోషపడ్డాడు. తనలాంటి నటులకు చిరంజీవి లాంటి వారు గొప్ప ఇనిస్పిరేషన్ అని చాటా చెప్పాడు. చిరంజీవికి తానెంత అభిమానిస్తున్నాడు? అన్నది అద్దం పట్టింది. ఆ నమస్కారం అన్నది చిరంజీవి చిత్ర పరిశ్రమలో సాధించిన విజయాలు, గౌరవానికి ప్రతీక. చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అంచలం చెలుగా ఎదిగిన నటుడు.
ఆ కష్టానికి ఇచ్చిన గౌరవం అది. ధనుష్ కూడా కోలీవుడ్ లో అలా ఎదిగిన నటుడే. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. మల్టీ పర్సనాల్టీగా ప్రేక్ష కుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇలా ఇన్ని శాఖల్లో రాణించడం అంటే చిన్న విషజ్ఞం కాదు. ఎంతో పట్టుదల, కృషి, క్రమశిక్షణ ఉంటే తప్ప సాధ్యం కాదు. అవన్నీ తనలో ఉన్నాయి కాబట్టే గొప్ప స్టార్ అయ్యాడు.
పెద్దలను గౌరవించడం జరుగుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్పూర్తితోనే ధనుష్ సినిమాల్లోకి వచ్చా డు. రజనీ లా గొప్ప స్టార్ కావాలని కష్టపడి పైకొచ్చాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసు కున్నాడు. స్టార్ అయిన తర్వాత రజనీ ఇంటికే అల్లుడు అవ్వడం..విడాకులివ్వడం తెలిసిందే.