ఫోటో స్టోరి: మిస మిస మెరుపుల మెహబూబా
తనదైన అందం, అద్భుత డ్యాన్సింగ్ స్కిల్ తో యువతరంలో ప్రత్యేకించి ఫాలోయింగ్ తెచ్చుకుంది ధనశ్రీ వర్మ. ఈ బ్యూటీని ఇన్ స్టా సహా సోషల్ మీడియాలో లక్షలాదిగా అభిమానులు అనుసరిస్తున్నారు.;
తనదైన అందం, అద్భుత డ్యాన్సింగ్ స్కిల్ తో యువతరంలో ప్రత్యేకించి ఫాలోయింగ్ తెచ్చుకుంది ధనశ్రీ వర్మ. ఈ బ్యూటీని ఇన్ స్టా సహా సోషల్ మీడియాలో లక్షలాదిగా అభిమానులు అనుసరిస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ధనశ్రీ రెగ్యులర్ ఫోటోషూట్లు, వీడియో షూట్లను షేర్ చేస్తున్నారు.
తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు పెంచుతోంది. ధనశ్రీ వర్మ డ్యాన్సింగ్ డాళ్ అవతారంలో ఉన్న ఈ ఫోటోగ్రాఫ్స్ వేడెక్కిస్తున్నాయి. ఇది ఆన్ లొకేషన్ ఫోటోషూట్. జిలి బిలి మెరుపుల ఛమ్కీల థై స్లిట్ ఫ్రాకులో ధనశ్రీ అందచందాలు మతులు చెడగొడుతున్నాయి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ధనశ్రీ థై సొగసులను ఎలివేట్ చేస్తూ, చాలా ఫోజులిచ్చింది. ధనశ్రీ మిస మిసలు మతులు చెడగొడుతున్నాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలి కాలంలో తన మాజీ భర్త చాహల్ తో వివాదం కారణంగా ధనశ్రీ మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. వృత్తి పరమైన విషయాల కంటే ఇప్పటికీ వ్యక్తిగత విషయాలతోను ఎక్కువగా లైమ్ లైట్ లోకొస్తోంది. తాజాగా యజ్వేంద్ర చాహల్ తాను పెళ్లికి రెడీగా ఉన్నానంటూ టీజ్ చేసాడు.
మాజీ భార్య ధనశ్రీ వర్మ 2022 నుండి విడివిడిగా ఉంటూ 2025లో అధికారికంగా విడాకులు తీసుకున్నారని కథనాలొచ్చాయి. ఈ జంట బ్రేకప్ గురించి ఇప్పటికీ చర్చ సాగుతోంది. దీనికి తోడు మాజీలు ఒకరిపై ఒకరు చాలా క్రిప్టిక్ వ్యాఖ్యలతో ప్రజలకు వినోదం పంచుతున్నారు. యుజీ ఆర్జే మహవాష్‌తో డేటింగ్ చేస్తున్నాడని కూడా పుకార్లు ఉన్నాయి. ఈ పుకార్ల నడుమ, యూజీ రెండవ వివాహానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించడం వేడెక్కించింది.
తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ తాను వివాహానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. అందమైన సీక్విన్డ్ బ్లాక్ సూట్ ధరించి రెండవ వివాహంపై తన ఉద్దేశాన్ని యూజీ బయటపెట్టాడు. అయితే తాను రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్నా ఇంకా డ్రీమ్ గర్ల్ ని కనుగొనలేదని వెల్లడించాడు.