చాహల్‌పై కొత్త డౌట్ పెట్టేసిన మాజీ భార్య ధనశ్రీ
ఇటీవల ధనశ్రీ పాల్గొంటున్న షో `రైజ్ & ఫాల్` ఎపిసోడ్‌లో చాహల్ పై చేసిన ఒక కామెంట్ కొత్త సందేహాన్ని రైజ్ చేసింది.;
2025లో అత్యంత చర్చనీయాంశమైన విడాకుల కేసుల్లో ఒకటి చాహల్ -ధనశ్రీ వర్మ కేసు. ఈ జంట ప్రేమకథ ప్రజలకు స్పష్ఠంగా తెలుసు. ఆ ఇద్దరి అన్యోన్యత గురించి చాలా చర్చించుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ ఇద్దరి నడుమా కలతలు వచ్చాయి. భార్యాభర్తల నడుమ కొన్ని వాగ్వాదాలు, అనుమానాలు వగైరా వగైరా వ్యవహారాలు అగ్లీ ఫైట్‌గా మారాయి.
విడాకుల ప్రక్రియలో మెలోడ్రామాను మీడియాలు బాగా కవర్ చేసాయి. వ్యక్తిగత వ్యవహారాలను పబ్లిక్ కి సినిమా చూపించాయి. ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం లేకపోవడమే విడాకులకు కారణమని ప్రచారమైంది. ఒకవైపు విడాకుల ప్రాసెస్ జరుగుతుండగానే చాహల్ తన స్నేహితురాలితో కలిసి క్రికెట్ స్టేడియంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
అయితే చాహల్ - ధనశ్రీ మధ్య సమస్య ఏమిటన్న దానిపై ఇప్పటివరకూ స్పష్ఠత లేదు. ఇటీవల ధనశ్రీ పాల్గొంటున్న షో `రైజ్ & ఫాల్` ఎపిసోడ్‌లో చాహల్ పై చేసిన ఒక కామెంట్ కొత్త సందేహాన్ని రైజ్ చేసింది. షోలో విడాకుల అంశంపై ధనశ్రీని హోస్ట్ ప్రశ్నించారు. అయితే ఈ విడాకుల గురించిన కబుర్లు వినడం మానేసాను. జీవితంలో ఈ అధ్యాయాన్ని వదిలేసాను. జనం ఎప్పుడూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూనే ఉంటారు.. కానీ మీలోపల మీకు అనిపించేవి ముఖ్యమైనవి.. ఏం జరిగినా నేను కూడా నా గురించి నేను నిరంతరం వివరించాల్సి ఉంటుందని ధనశ్రీ అన్నారు.
చాహల్ ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేస్తున్నాడో తనకు తెలుసని హోస్ట్ అన్నారు. అయితే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదని ధనశ్రీ అన్నారు. భర్తను మోసం చేసారని ప్రచారమైంది కదా? అని ప్రశ్నించగా, ధనశ్రీ ఇలా స్పందించింది. వారు నా గురించి ఇలాంటి చెత్తను ప్రచారం చేస్తారు. నేను నోరు తెరుస్తానని అతడు భయపడుతున్నాడు. ఇదంతా నా నోరు మూయించడానికి చేస్తున్నారు. ఏం జరిగిందో నిజమైన వివరాలు నేను మీకు చెబితే.. ఈ షో మీకు కొరుకుడుపడని బటానీలాగా కనిపిస్తుంది.. అని వ్యాఖ్యానించింది.
పెళ్లి గురించి ప్రస్థావించగా.. తాను మరో కొత్త సంబంధానికి సిద్ధంగా లేనని ధనశ్రీ వ్యాఖ్యానించారు. ఒకరితో సంబంధం కారణంగా తాను చాలా కష్టాలు అనుభవించానని, పరిశ్రమలో `మహిళా సల్మాన్ ఖాన్`గా ఉండాలని కోరుకుంటున్నానని కూడా ధనశ్రీ చెప్పింది. విడాకుల తర్వాత చాహల్ గౌరవంగా ప్రవర్తించలేదని ఇంటర్వ్యూవర్ విమర్శించారు.