పాజిటివ్ రివ్యూస్.. ఆ ప్రొడ్యూసర్ ప్లాన్ ?

బాలీవుడ్ లవ్ స్టోరీ ధడక్ 2 నేడు రిలీజైంది. త్రిప్తి డిమ్రి- సిద్ధాంత్ జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.;

Update: 2025-08-01 15:30 GMT

బాలీవుడ్ లవ్ స్టోరీ ధడక్ 2 నేడు రిలీజైంది. త్రిప్తి డిమ్రి- సిద్ధాంత్ జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2 నుండి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ కారణంగా బాక్సాఫీస్ రేస్లో ధడక్ 2 సినిమానే ముందున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే రివ్యూలు వచ్చేశాయి. క్రిటిక్స్ ఈ సినిమాను హార్డ్ హిట్టింగ్ అని ప్రశంసిస్తున్నారు. సినిమాలో నటీనటులు ఎమోషన్స్ బాగా పండించారని, డైరెక్టర్ రైటింగ్ స్క్రిల్స్ బాగున్నాయని, సెకండ్ హాఫ్ సూపర్ అని బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్ష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు నెటిజన్లు సైతం ఆదర్ష్ రివ్యూతో అంగీకరిస్తున్నారు. సినిమా స్టోరీ లైన్, క్లైమాక్స్ సూపర్ అంటూ ప్రశంసించారు.

ఈ సినిమా క్లైమాక్స్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని, అచ్చం తమిళ స్టార్ సూర్య నటించిన జై భీమ్‌ క్లైమాక్స్ లాగా ఉందని అంటున్నారు. ఇందులోనూ క్యాస్ట్ బేస్డ్ సమస్యలు, దాని ప్రామాణికత, డెప్త్ ఆధారంగానే ఉందని ప్రశంసిస్తున్నారు. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు మరపురానివని, ఎంతో సున్నితత్వంతో తెరకెక్కించారని సమీక్షకులు చెబుతున్న మాట.

ఈ పాజిటివ్ రెస్పాన్స్ తో సినిమా రానున్న రోజుల్లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ధడక్ తొలి పార్ట్ కంటే ఈ సీక్వెల్ పెద్ద విజయం అందుకునే ఛాన్స్ ఉంది. ఆ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు చేయోచ్చని అంటున్నారు. అంతేకాకుండా 2025లో హిందీలో ధడక్ 2 సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి కావొచ్చు.

అయితే ఇక్కడే కొందరికి ఓ సందేహం వస్తుంది. ఓపెనింగ్ డే ఎర్లీ రివ్యూస్ జెన్యూన్ గా ఉంటాయా అని. లేకపోతే ఇవన్నీ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ మార్కెటింగ్ ప్రణాళికలో భాగమా అనే ప్రశ్న తలెత్తింది? బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరచుగా ఇటువంటి వ్యూహాలను అనుసరిస్తుండడంతో విమర్శకులు ఎలా వ్యవహరిస్తున్నారనేది కూడా ఆలోచించదగినదే!

క్రిటిక్స్ ఒక సినిమాను దాని కథ, కథాశాల ఆధారంగా ప్రశంసించవచ్చు, కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం కేవలం వినోదం కోసమే సినిమా చూస్తారు. ధడక్ 2 కు ఆ బ్యాలెన్స్ లేకపోతే, ప్రేక్షకులు ఈ రివ్యూలను కొట్టిపారేస్తారు. క్రిటిక్స్ కు ఆడియెన్స్ థింకింగ్ కు మధ్య చాలా తేడా ఉంటుంది.

Tags:    

Similar News