• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `పుష్ప 2` ఇంట‌ర్వెల్‌పై...

`పుష్ప 2` ఇంట‌ర్వెల్‌పై దేవీశ్రీ లీకులు

| పుష్ప 2 విడుదలకు ఇంకా సమయం ఉన్నా ఈ సినిమా గురించిన ప్ర‌తి అప్ డేట్ అభిమానుల్లో అంత‌కంత‌కు వేడి పెంచుతూనే ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2023-11-18 16:14 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర‌లో ఉర్రూతలూగించాడు. భ‌యం అన్న‌దే లేని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో జీవించాడు. పుష్ప నడక, న‌డ‌త‌, మాటలు, డ్యాన్సుల‌ శైలి అన్నీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అనుక‌రించ‌డం ఒక సంచ‌లనం. పుష్ప 2 విడుదలకు ఇంకా సమయం ఉన్నా ఈ సినిమా గురించిన ప్ర‌తి అప్ డేట్ అభిమానుల్లో అంత‌కంత‌కు వేడి పెంచుతూనే ఉన్నాయి. .ఇప్పుడు పుష్ప 2కి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.

`పుష్ప 2`లో అల్లు అర్జున్ అందర్నీ ఆశ్చర్యపరుస్తాడని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. దర్శకుడు సుకుమార్ తనకు, పాటల రచయిత చంద్రబోస్‌కి కథను చెప్పారని, ప్రతి సన్నివేశాన్ని అంత ఇంటెన్సిటీతో తెర‌కెక్కించార‌ని కూడా అన్నారు. బ‌న్ని త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్లో ఉద్వేగం నింపుతార‌ని సంగీత దర్శకుడు దేవీ చెప్పారు. సినిమాలోని సన్నివేశాలను వివరించిన విధానం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుందని కూడా DSP అన్నారు. ప్రతి సన్నివేశం అభిమానులను సీట్ అంచుకు జారేంత‌గా సుకుమార్ స్క్రీన్‌ప్లే రూపొందించార‌ని దేవీశ్రీ అన్నారు. సంగీతం ఉర్రూత‌లూగిస్తుంద‌ని కూడా న‌మ్మ‌కంగా చెప్పాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి ఝ‌ల‌క్ ఇస్తుందని కూడా అన్నాడు! .

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, పుష్ప 2 లో ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఉందని, అది అంద‌రినీ షాక్ కి గురి చేస్తుంద‌ని DSP వెల్లడించారు. జాతర సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి అవతారంలో కనిపించనున్నారు. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ నటన అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఆశ్చర్యానికి గురి చేస్తుందని DSP గొప్పగా చెప్పాడు. ఆ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని అన్నాడు.

అల్లు అర్జున్ పుష్ప 2ని గ్రాండ్ లెవల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. ఇటీవలే సీక్వెల్ మొదటి భాగం కంటే మెరుగ్గా ఉండాల‌ని, SS రాజమౌళి RRR కంటే పెద్ద స్థాయిలో ఎలివేట్ అవ్వాల‌ని భావించార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కంటెంట్ కి త‌గ్గ‌ట్టే కాన్వాస్ ని కూడా భారీత‌నంతో మ‌లిచారు. యాక్ష‌న్ కంటెంట్ లో సూప‌ర్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌నున్నార‌ని తెలిసింది.

ఈ సీక్వెల్‌లో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండ‌గా, అన‌సూయ కూడా త‌న పాత్ర‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా తిరిగి అల‌రించ‌నున్నారు. జగదీష్ ప్రతాప్ బండారి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు త‌దిత‌రుల న‌ట‌న మ‌రో లెవ‌ల్లో ఉంటుంది. పుష్ప‌2 చిత్రీకరణ అక్టోబర్ 2022లో ప్రారంభమైంది. ఈ చిత్రం స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా 15 ఆగస్ట్ 2024న విడుదలవుతోంది.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmikamandana 
  • Sukumar 
  • Devisreeprasad 

Similar News

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS