సొంత ఊరి నుంచి దేవి ఎల్లమ్మ కనెక్షన్
మొదటిసారి దేవిశ్రీప్రసాద్ వెండితెరపై ఒక డిఫరెంట్ లీడ్ రోల్ వహేయనున్న విషయం తెలిసిందే.
మొదటిసారి దేవిశ్రీప్రసాద్ వెండితెరపై ఒక డిఫరెంట్ లీడ్ రోల్ వహేయనున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి లేటెస్ట్ గా డీఎస్పీ ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశారు. తన సొంత ఊరైన వెదురుపాక గ్రామానికి వెళ్ళిన విశేషాలను ఒక వీడియోలో పంచుకున్నారు. చిన్నప్పుడు చెన్నై లాంటి సిటీ నుంచి తమను ఈ పల్లెటూరికి తీసుకువచ్చేవారని, ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణాన్ని అనుభవించేలా తన తండ్రి చేసేవారని డీఎస్పీ గుర్తుచేసుకున్నారు.
సొంత ఊరితో, అక్కడి ప్రజలతో కనెక్షన్ ఎప్పటికీ తెగిపోకూడదనే ఉద్దేశంతోనే అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నారట. ఈ పర్యటనలో భాగంగా వెదురుపాకలో జరిగిన లోకల్ జాతరలో డీఎస్పీ పాల్గొన్నారు. అక్కడ స్థానిక కళాకారులతో కలిసి డప్పు కొడుతూ, నృత్యాలు చేస్తూ పక్కా పల్లెటూరి వాతావరణంలో కలిసిపోయారు. చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో ప్రభావితం చేసిన జానపద కళలు, సంప్రదాయాలు, అక్కడి దైవత్వం తనలో మళ్లీ ఒక కొత్త క్రియేటివ్ ఎనర్జీని నింపాయని డీఎస్పీ ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రయాణాన్ని తన తండ్రికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులకు అంకితం ఇచ్చారు.
బలగం లాంటి సినిమాతో పల్లె మూలాలను అద్భుతంగా చూపించిన వేణు యెల్దండి, ఈసారి ఎల్లమ్మ కథను కూడా అదే స్థాయిలో ఫోక్ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. తన ఊరి జాతరలో చూసిన ఆ రా, రస్టిక్ వైబ్స్ ఎల్లమ్మ స్క్రిప్ట్ కు పర్ఫెక్ట్ గా సింక్ అవ్వడంతోనే ఈ ప్రాజెక్ట్ లో నటుడిగా, సంగీత దర్శకుడిగా జాయిన్ అవ్వడానికి డీఎస్పీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్ధమవుతుంది. ఈమధ్య కాలంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు లోకల్ ఫోక్ మ్యూజిక్ ఎంత పెద్ద అసెట్ అవుతుందో బాక్సాఫీస్ లెక్కలు చూస్తేనే తెలుస్తోంది.
కాంతార, పుష్ప లాంటి సినిమాలు వాటి నేటివిటీ వల్లే దేశవ్యాప్తంగా అంతటి భారీ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు డీఎస్పీ కూడా కమర్షియల్ హంగులు పక్కన పెట్టి, స్వయంగా తన గ్రామీణ మూలాల్లోకి వెళ్లి ఆ ఎనర్జీని రీఛార్జ్ చేసుకున్నారు. సొంత ఊరి జాతర స్ఫూర్తి, పల్లెటూరి మూలాలు ఆయనలో ఒక కొత్త క్రియేటివ్ డ్రైవ్ ని క్రియేట్ చేశాయని అర్ధమవుతుంది.
అందుకే ఎల్లమ్మ ఆల్బమ్ లో ఒక అచ్చమైన జానపద సోల్ ఉండబోతోందని అర్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. డీఎస్పీ మొదటిసారి హీరోగా నటిస్తూ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తన సొంత ఊరి జాతర వైబ్స్ తో రీఛార్జ్ అయిన ఈ రాక్ స్టార్, సిల్వర్ స్క్రీన్ పై ఎల్లమ్మ రూపంలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.