• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి...

అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి 'దేవర'?

| యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

By - Tupaki Desk
Update: 2024-06-12 07:59 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమాని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోయే మూవీ ఇదే కావడంతో అభిమానులు చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్ దేవర చిత్రంతో ప్రతినాయకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. భారీ తారాగణంతో కంప్లీట్ ఫిక్షనల్ జోనర్ ఈ చిత్రం సిద్ధం అవుతోంది.

అక్టోబర్ 10న దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. దేవర సినిమా చెప్పిన డేట్ కంటే ముందుగానే రిలీజ్ అవుతుందనే ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ డేట్ కి ఓజీ వచ్చే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది.

అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ సందర్భంగా ఓజీ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఓజీ మూవీ వాయిదా వేస్తే ఆ డేట్ కి దేవరని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ రిలీజ్ కావడంతో దేవర మూవీ ముందుగా వస్తుందా లేదా అనే విషయంలో కొంత సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే దేవర వస్తే ఆ సమయానికి సితార నాగవంశీ పోటీగా రాకపోవచ్చు.

మేగ్జిమమ్ ముందు ఎనౌన్స్ చేసిన ప్రకారమే దసరా రేసులోనే దేవర సినిమాని థియేటర్స్ లోకి రావచ్చు. కానీ ఛాన్స్ ఉంటే బేస్ట్ డేట్ ని ఎవరి మాత్రం వదులుకుంటారు. ఇక దసరా రేసులో తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషలలో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే మరో కొత్త ప్రచారం నడిచింది. ఇలా దేవర సినిమాపై చాలా డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ పై మరోసారి చిత్ర నిర్మాతలు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    
  • Devara 
  • Ntr 
  • Koratalasiva 
  • Kalyanram 
  • Anirudh 
  • Tollywood 
  • Og 
  • Janhvikapoor 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS