'డీమోంటీ కాలనీ 3' సైలెంట్ గా పట్టాలెక్కేసిందే!
ఈ సినిమా కథ విషయానికి వస్తే!`డీమోంటీ కాలనీ లో హత్యలకు కారణం ఏంటి? అన్నది రెండవ పార్ట్ లో క్లియర్ గా రివీల్ చేసారు. థర్డ్ పార్ట్ లో ఆ దుష్ట శక్తితో పోరాటం పీక్స్ లో ఉంటుందని చెప్పొచ్చు.;
కోలీవుడ్ హారర్ థ్రిల్లర్ `డీమోంటీ కాలనీ` ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. రెండు భాగాలు ఊహించని ఫలితాలు సాధించాయి. రెండవ భాగం ఏకంగా 100 కోట్ల క్లబ్ లోనే చేరింది. దీంతో మూడవ భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. రెండు భాగాలను మించిన థ్రిల్ ని థర్డ్ పార్ట్ అందిచేలా సెకెండ్ పార్ట్ లో కొన్ని లీడ్స్ కూడా వదిలేసారు. 2027లో రిలీజ్ చేస్తామని అప్పుడే ప్రకటించారు. మరి ఈ ప్రాజెక్ట్ పనులు ఎంత వరకూ వచ్చాయి? అంటే దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సైలెంట్ గా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రారంభమైనట్లు గానీ, ఆన్ సెట్స్ లో ఉన్నట్లు గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కానీ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. గత రెండు భాగాలకంటే తక్కువ పాత్రలతోనే పార్ట్ 3ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అరుల్ నితి, ప్రియాభవానీ శంకర్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతోంది. వీరిద్దరితో పాటు మీనాక్షి గోవిందరాజన్, వెట్టై ముత్తుకు మార్, అర్చనా రవిచంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే!`డీమోంటీ కాలనీ లో హత్యలకు కారణం ఏంటి? అన్నది రెండవ పార్ట్ లో క్లియర్ గా రివీల్ చేసారు. థర్డ్ పార్ట్ లో ఆ దుష్ట శక్తితో పోరాటం పీక్స్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఆ దుష్ట శక్తి ముగింపు ఏ గదిలో అయితే కథ మొదలవుతుందో? అదే గదిలో ముగింపు ఉంటుందని మెయిన్ లీడ్ పోషించిన అరుళ్నిధి క్లైమాక్స్ లో చెప్పేసారు. అంటే మూడవ భాగంతో డీమోంటీ కాలనీ ప్రాంచైజీ మొత్తం పూర్తవుతుంది.ఆ తర్వాత ఎలాంటి కొనసాగింపు ఉండదని దర్శకుడు అజయ్ జ్ఞానమూర్తి అప్పుడే హింట్ ఇచ్చేసాడు.
చనిపోయిన పాత్రలు మినహా రెండవ భాగంలో ఉన్న పాత్రలన్నీ మూడవ భాగంలోనూ కొనసాగుతాయి. అదనంగా కొత్త పాత్రల కలయికతో పార్ట్ 3 ఉంటుందని తెలుస్తోంది. `డీమోంట్ కాలనీ` 2015 లో రిలీజ్ అయింది. కానీ రెండవ భాగం రిలీజ్ చేయడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. కానీ మూడవ భాగానికి మాత్రం అంత సమయం తీసుకోలేదు. మూడేళ్లు మాత్రమే తీసుకుని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.